గంభీరంగా గర్జించిన నారా భువనేశ్వరి
చంద్రబాబు తప్పు చేయలేదు, చేయరు
నిజం గెలవాలి. నిజమే గెలవాలి
రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భందించారు
ఈ పోరాటం నాది కాది. మన అందరిదీ
రాష్ట్రం భవిష్యత్తు కోసం ఈ పోరాటం.
ఎన్టీఆర్ కుమార్తెగా గర్విస్తున్నా
చంద్రగిరి నియోజకవర్గ అగరాలలో బుధవారం జరిగిన సభ నారా భువనేశ్వరి తొలి రాజకీయ బహిరంగ. సభ తన రాజకీయ అరంగ్రేయటానికి మొదటి అడుగు. ఇందుకు సొంత నియోజక వర్గం, సొంత మండలాన్ని ఎంచుకున్నారు. తండ్రి, చంద్రబాబు నాయుడు ఆనవాయితీని ప్రకారం ముందుగా తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అత్తగారిల్లు అయిన నారావారిపల్లెలో అడుగుపెట్టారు. నారావారిపల్లెలో అత్తమామల సమాధి వద్దకు వెళ్లి పూజలు చేసి, వారి ఆశీస్సులు కూడా పొందారు. అనంతరం తన కుల దేవత అయిన నాగాలమ్మకు పూజలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించి, వారి ఆశిస్సులు కూడా పొందిన తర్వాత భువనేశ్వరి రాజకీయ వేదిక మీదకి అడిగుపెట్టారు.
తెలుగుదేశం పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తొలి బహిరంగ సభలో గంభీరంగా గర్జించారు. తన భర్త ఎం తప్పు చేశారని జైలులో నిర్భందించారని ప్రభుత్యాన్ని సూటిగా ప్రశించారు. తన భర్త తప్పు చేయలేదని, చేయరని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఎ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేసారో చెప్పాలని నిలతీశారు. కన్నీటితో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తండ్రి నందమూరి తారక రామారావు వలే ఆమె గంభీరంగా మాట్లాడటం సభికులకు నచ్చింది. ఆమె ఎక్కడ సానుభూతి కోసం వెంపర్లాడలేదు. తన భర్త నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా నిర్బంధించారని, ఇందుకోసమే ఈ పోరాటమని పేర్కొన్నారు. చంద్రబాబును కాదు రాష్ట్రాన్ని న్యాయాన్ని నిర్భందించారని అన్నారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ప్రజల చేత నినాదాలు చేయించారు. ఈ పోరాటం నాది ఒక్కరిదే కాదు మన అందరిదీ అంటూ అందరినీ భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రం కోసమే ఈ పోరాటమని తమ స్వార్థం కాదని స్పష్టం చేశారు. NTR బిడ్డగా తాను గర్విస్తున్నానని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పకనే చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చేస్తున్న సేవలను వివరించారు. చంద్రబాబు నాయుడిని తాను ఎప్పుడూ పొగడ లేదంటూ ఒక విమర్శికురాలిగా తనను తాను అభివర్ణించుకున్నారు.
ఆమె మాట్లాడుతూ... ఐటీ విషయంలో నేను నెగిటివ్ గా చెపితే, భవిష్యత్తులో చూడమని చెప్పారు. అలాంటి విజనరీ పై తప్పుడు కేసులు పెట్టారు. మొదట మూడు వేల కోట్లు అన్నారు. తర్వాత 300 కోట్లు అన్నారు. తర్వాత 27 కోట్లు అంటున్నారు. వాళ్ళ ఆలోచన ఎంత దిగజారుతోంది. అందరిపైనా కేసులు. ఎవరిని కలిసినా 20, 30 కేసులు ఉన్నాయి అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే ద్యాస. తప్పుడు కేసులు పెట్టడమే. పరిపాలన ఉందా, భయ పెట్టడం తప్ప అభివృద్ధి లేదు. ఏ రాష్ట్రానికి ఇలాంటి కష్టం రాకూడదు. చేయి చేయి కలిపి ముందుకు వెళ్దాం. చంద్రబాబునీ అరెస్ట్ చేస్తే ఆయన మానసికంగా శారీరకంగా కృంగి పోతారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయనది స్ట్రాంగ్ పర్శనాలిటీ. ఆయన ఇంకా ధైర్యంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తారని ప్రజలకు ధైర్యం చెప్పారు.
‘‘నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడకు రాలేదు. నిజం గెలవాలి అని చెప్పేందుకే వచ్చాను. ఈ పోరాటం నాది కాదు. ప్రజలందరిదీ. యువతకు ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు నిత్యం ఆలోచించేవారు. సరైన రోడ్డు లేని ప్రాంతంలో రాళ్లు..రప్పల మధ్య హైటెక్ సిటీ ఏంటని?.. నిర్మాణ సమయంలో అందరూ హేళన చేశారు. అయినా పట్టించుకోకుండా చిత్తశుద్ధితో పనిచేసి లక్షల మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారు’’ అని అన్నారు.
స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసుల్లో ఆధారాలు ఉన్నాయా అని నారా భువనేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్ల పాటు చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పుంగనూరులో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా అధికార పార్టీ ఏమీ చేయలేకపోయిందని చెప్పారు. కాగా, ఈ రోజు ఉదయం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాల వేసి ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తలు, అబిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు.