10, అక్టోబర్ 2023, మంగళవారం

మెప్మా దందాలపై కమిషనర్ విచారణ చేయాలి: CPI

సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు డిమాండ్


చిత్తూరు నగరపాలక సంస్థ కు సంబంధించిన మెప్మా  పరిధిలో డ్వాక్రా మహిళల పొదుపు సంఘాలు మహిళలు వారి పొదుపు కోసం  వారి కుటుంబ  ఆర్థిక పరిస్థితిని  మెరుగుపరచుకోవడానికి పెట్టుకున్న డ్వాక్రా గ్రూపులకు అనుసంధానంగా రిసోర్స్ పర్సన్స్ ,  కమ్యూనిటీ ఆర్గనైజర్లు సిటీ మిషన్ మేనేజర్  లు   డ్వాక్రా గ్రూపులను పర్యవేక్షిస్తుంటారు. డ్వాక్ర గ్రూపు మహిళలకు బ్యాంకు ద్వారా రుణం పొందాలంటే రిసోర్స్ పర్సన్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్, సిటీ మిషన్ మేనేజర్ వీరి సహకారం అవసరం ఉన్నది. ఇలాంటి సందర్భాల్లో డ్వాక్రా మహిళా గ్రూపుల వద్ద బ్యాంకుల ద్వారా పొందాలంటే వారికి  ఎంతో కొంత ఇవ్వాల్సిందే  లేకపోతే ఏదో ఒక సాకు చెప్పి గ్రూపుల పైన తప్పుడు సమాచారం అధికారులకు చెప్పి రుణాలను ఆపేస్తారు. మహిళ గ్రూప్ లీడర్లు వారిని ప్రశ్నిస్తే ఏదో ఒక సాకు చెప్పి గ్రూపుల పైన తప్పుడు సమాచారం అందించి నిలిపివేస్తారు. 

అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి కూడా భయపడతారు. ప్రతి నెల గ్రూప్ సమావేశాలు జరిగేటప్పుడు రుణాలు పొందేటప్పుడల్లా వారికి ఎంతో కొంత డబ్బులు   ముట్ట చెప్పాల్సిందే. అలాగే చిత్తూరు ఎమ్మెస్సార్ కాంప్లెక్స్ లోని "ఈ సేవ కేంద్రం" లో మహిళా గ్రూపులతో  సూపర్ మార్కెట్ ఒకటి పెట్టి అందులోని సరుకులను ప్రతి  డ్వాక్రా గ్రూపులు  తీసుకోవాలనే నిబంధనలు షరతులు పెట్టారు. అక్కడి రేట్లు కు ఓపెన్ మార్కెట్కులోని రేట్లుకు కూడా వ్యత్యాసంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చిత్తూరు మెప్మా లో జరుగుతున్న దందాల పైన , సూపర్ మార్కెట్ పైన కూడా విచారణ చేపట్టి అవకతవకలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ .నాగరాజు డిమాండ్ చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *