పలుచోట్ల జగనాసుర దహనం
ముదస్తుగా పలువురిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలో
జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు" దేశం చేస్తుంది రావణాసుర దహనం మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమం జిల్లాలో పలు చోట్ల జరిగింది. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట పోకనాటివీధి నందు రాష్ట్ర తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి యస్.యం.పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో జరిగింది. వెదురుకుప్పం మండలం జక్కదన్న గంటావారిపల్లి గ్రామపంచాయతీకి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు జగనన్న నరకాసుర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు పట్టణంలో తెలుగు యువత చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు కాజూరు రాజేష్ ఆధ్యర్యంలో సైకో జగన్మోహన్ రెడ్డి పోవాలి అంటూ జగన్ ఫోటోలు దహనం చేయటం జరిగింది. పెనుమూరు మండలం పెరుమాల కండ్రిగ గ్రామస్థులు జగనాసుర ధహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు ముందు జాగర్తగా పలువులు తెదేపా జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు చేపట్టబోయే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొంటారని జనసేన ఇంచార్జి యుగంధర్ పొన్న హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పెనుమూరు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే చిత్తూరులో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
వెదురుకుప్పం మండలం జక్కదన్న గంటావారిపల్లి గ్రామపంచాయతీకి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పిలుపుమేరకు జగనన్న నరకాసుర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నచ్చుకూరు ఉప్పరపల్లి జక్కదన్న గంటవరపల్లి గ్రామం సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పాల్గొని జగన్ నరకాసుర అనే కార్యక్రమాన్ని చేశారు. జగన్ వైఖరిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాబు రెడ్డి, భాస్కర్ యాదవ్, భీమినేని మాధవ నాయుడు, వెంకటేష్ యాదవ్, వెంకటరెడ్డి, గిరి రెడ్డి, హేమ సుందర్ రెడ్డి, ఎల్ వంశీ యాదవ్, ఉదయ్ యాదవ్, బ్రహ్మానందరెడ్డి, చిట్టిబాబు, ప్రభాకర్ రెడ్డి, నరసింహులు, చంద్ర యాదవ్, సూర్యనారాయణ రెడ్డి, మధు, టైలర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.