26, అక్టోబర్ 2023, గురువారం

పాలసముద్రం రిసార్టులో కోవర్టు రాజకీయం జరిగిందా?


పాలసముద్రంలోని  రిసార్టులో  ఎం జరిగింది అనేది రహస్యంగానే మిగిలిపోయింది. తెలుగుదేశం, YCP నాయకులు తమ మనుషుల ద్వారా సమాచారం తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెదేపా నేతకు సంబంధించిన రిసార్టుకు మంత్రి రోజా ఎందుకు వచ్చారు? అక్కడ తన భర్త జన్మదిన వేడుకలు ఎందుకు చేసుకున్నరన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. టిడిపి నేత చిట్టిబాబు నాయుడు, మంత్రి రోజా మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఏమిటి అన్నదాని మీదనే చర్చలు జరుగుతున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందం జరిగినట్లు అనుమానిస్తున్నారు. మంత్రి నారాయణస్వామికి, రోజాకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికలలో నారాయణ స్వామిని ఓడించి మంత్రి పదవికి అడ్డు తొలగించుకోవడానికి ఒప్పందం కుదిరిందని ఓ వర్గం భావిస్తోంది. YCP వాళ్ళతో చేతులు కలిపి గంగాధర నెల్లూరు తెదేపా అభ్యర్థిని ఓడిస్తే, నియోజకవర్గంలో గతంలో లాగా ఇంచార్జిగా మల్లి చక్రం తిప్పవచ్చని చిట్టిబాబు భావిస్తున్నారని నియోజక వర్గంలోని తెదేపా నాయకులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరిలో గాలి భాను ప్రకాష్ పోటీ చేస్తే, ఆయన తమ్ముడు గాలి జగదీష్ ను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయించడానికి చిట్టిబాబు సాయం కోరినట్టు ఒక కధనం కూడా  ప్రచారంలో ఉంది. అయితే రోజా కానీ, చిట్టిబాబు కానీ దీనిపై నోరు మెదపలేదు. గత రెండు రోజులుగా జరుగుతున్న నారా భువనేశ్వరి జిల్లా పర్యటనకు చిట్టిబాబు దూరంగా ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. 


గత ఆదివారం, సోమవారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి రేవా రిసార్ట్స్ లో ఉన్నారు. ఈ విషయం పత్రికలు, మీడియాలో రాకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు కూడా బయటి వారు ఎవరిని లోపలకు పోకుండా కాపు కాశారు. సాధారణమైన  విందులు, వినోదాలు అయితే అంత రహస్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. రోజా ప్రతి నిత్యం టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. రేవా రిసార్ట్స్ టిడిపి నేత చిట్టిబాబు నాయుడుది. రోజా చెన్నైలో ఎక్కడా రిసార్ట్స్ లేదా హోటళ్ళు లేనట్టు ఒక మండల కేంద్రంలోని రిసార్ట్స్ లో రెండు రోజులు ఎందుకు ఉన్నారు. ఆమెకు చిట్టిబాబు  ఉచితంగా బస, విందులు, వినోదాలు ఎందుకు ఏర్పాటు చేశారు అన్న చర్చ టిడిపి వర్గాలలో వినిపిస్తున్నది. నగరిలో తాను, జి డి నెల్లూరులో నారాయణ స్వామి గెలుపు సులభ సాధ్యం చేసుకోవడానికి చిట్టిబాబు బాబు సాయం కోరినట్టు తెలిసింది. నగరిలో గాలి భాను ప్రకాష్ పోటీ చేస్తే, ఆయన తమ్ముడు గాలి జగదీష్ ను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయించడానికి చిట్టిబాబు సాయం కోరినట్టు ఒక కధనం ప్రచారంలో ఉంది. అలాగే జి డి నెల్లూరులో నియోజక వర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ థామస్ ను ఓడించడానికి ఒప్పందం కుదిరిందని కొందరు అంటున్నారు. దీని కోసం భారీగా బేరం కుదిరింది అంటున్నారు. ఈ విషయాలను కొందరు టిడిపి నాయకులు పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారు. దీంతో అధిష్టానం చిట్టిబాబు, థామస్ పై కోపంతో ఉన్నట్టు తెలిసింది. కొత్త ఇంచార్జి కోసం అన్వేషణ ప్రారంభించినట్టు చెపుతున్నారు.


 పాలసముద్రం రాజేంద్ర, డాక్టర్ పి రవికుమార్ (గ్యాస్ రవి ), కార్వేటినగరం మాజీ వైస్ ఎంపీపీ, పెనుమూరు మండలానికి చెందిన తలారి రెడ్డప్ప పేర్లు తెరమీదికి వచ్చినట్టు సమాచారం. ఆ మేరకు రాష్ట్ర నాయకుడు ఒకరు వీరిలో కొందరితో మాట్లాడినట్టు తెలిసింది. ఇది ఎస్సీలకు కేటాయించి నందున  టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దీనిపై దృష్టి పెట్టారని  అంటున్నారు. ఇదిలా ఉండగా రిసార్ట్స్ రహస్యం బయట పెట్టాలని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి బహిరంగంగా డిమాండ్ చేశారు. అయిన రోజా కానీ, చిట్టిబాబు కానీ దీనిపై నోరు మెదపలేదు. ఇందులో రహస్యం, కుట్ర లాంటివి ఏవీ లేక పోతే ఎవరో ఒకరు వివరణ ఇవ్వవచ్చు కదా అంటూ నిలదీస్తున్నారు. 


పాలసముద్రం ఒక పర్యాటక స్థలం కాదు, అలాగే పుణ్యక్షేత్రం కూడా కాదు. జలపాతాలు, సెలయేర్లు లేవు. ఎం లేకున్నా, రోజా కుటుంబ సమేతంగా అక్కడికి ఎందుకు వచ్చిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే చిట్టిబాబు తనకు దీనికి సంబంధం లేదని, రోజా పేరుతో ఎవరో ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అయితే ఆయన మాటను నాయకులు వినడానికి కూడా ఇష్ట పడటం లేదని అంటున్నారు. త్వరలో చిట్టిబాబు, థామస్ ను పక్కకు పెడతారని రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *