జగన్ మీద విరచుకపడుతున్న పవన్ అభిమానులు
జగన్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విరచుకపడుతున్నారు. జగన్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అలాగే, జగన్ తండ్రి YS రాజశేఖర్ రెడ్డి రహస్యంగా రెండవ పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కొందరు సోదరి షర్మిల రెండు పెళ్ళిళ్ళు చేసుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబంలో ఇన్ని లోపాలు పెట్టుకొని పవన్ ను విమర్శించడం ఏమిటని నిలతీస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు గురించి కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేయడాన్ని రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ కు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లికి, రాష్ట్ర రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయాన్ని పదేపదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం వెనుక ఏదో ఉద్దేశ్యం ఉందని ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ లాగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నారా అని వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.
గురువారం సామర్లకోట లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేనని పవన్ కళ్యాణ్ మీద భారీగా విమర్శలు గుప్పించారు. ఆయన ప్యాకేజీ స్టార్ అన్నారు. గుంపత్తుగా పార్టీని, క్యాడర్ ను తెలుగుదేశం పార్టీకి అమ్ముకున్నారని ఆరోపించారు. అప్పుడప్పుడు రాజకీయాల మాట్లాడుతారని తెలిపారు. తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి కూడా పట్టించుకోవడం లేదన్నారు. సినిమాకు సినిమాకు షూటింగ్ మధ్యలో వచ్చి రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా వేశారు. సరుకులు అమ్ముకున్నట్టు పార్టీని మొత్తాన్ని అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూశారు. పవన్ కళ్యాణ్ ఇల్లు హైదరాబాదులో ఉంటుంద,ని అందులో భార్యలు మాత్రం మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటారని సెటైర్ వేశారు. ఒకరు లోకల్ అని, ఇంకొకరు నేషనల్ అని, ఇంకొకరు ఇంటర్నేషనల్ అని వివరించారు. ఇంకొకసారి ఎక్కడికి వెళ్తారో తెలియదని అన్నారు. దీని మీద ప్రజలు విరుచుకుపడుతున్నారు. రాజకీయాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి మాట్లాడితే బాగుంటుందని, వ్యక్తిగత విషయాలు ప్రస్తావనకు తేవడం మంచిది కాదని అంటున్నారు. రాజకీయాలలో కొన్ని నైతిక విలువలు ఉన్నాయని, వాటికి కట్టుబడి చేయాలని పేర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని ఆశ ఉంటే భార్య భారతిని ఒప్పించి చేసుకోవచ్చని అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే ముందు జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబ వ్యవహారాలను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేలు పవన్ కళ్యాణ్ వైపు చూపిస్తే, మూడు వేళ్ళు మీ వైపే కదా చూసిస్తాయని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్ కుటుంభానికి సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతుంది. తల్లి విజయమ్మ పార్టీలోకి రారు, చెల్లి షర్మిల ఇంటికి రారు. భార్య భారతి గుడికి రారు అన్ని నెటిజెన్లు జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్ ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ముందు తల్లితో, చెల్లితో సఖ్యతగా ఉండాలని, తర్వాత నీతులు చెపితే బాగుంటుందని ఆనంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని చెల్లి షర్మిల పాదయాత్ర చేశారు. తల్లి విజయమ్మ ప్రచార బాధ్యతలను నిర్వహించారు. ఇష్టం లేకపోయినా విశాఖ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటువంటి తల్లిని, చెల్లిని పక్కనపెట్టి, వారికీ ఆస్తిలో ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు వడ్డాణం చేపించాడని తండ్రి రాజశేఖర్ రెడ్డి తరచుగా అనేవాడని పేర్కొన్నారు. ఆ సామెత ప్రస్తుతం జగన్ కు అతికినట్లు సరిపోతుందని ఎంబి సుధాకర్ రెడ్డి ఎద్దేవా వేశారు. తల్లిని, చెల్లిని ఇంటికి పిలిచి పండగ పూట భోజనం పెట్టి, చీర జాకెట్ కూడా పెట్టని జగన్ మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. అలాగే హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం గుడికి వెళ్లాలన్న, పూజలు చేయాలన్న భార్య పక్కన ఉండాలని, అయితే జగన్ భార్య భారతి ఎందుకు తనను అనుసరించడం లేదని ప్రశ్నించారు. ముందు ఇల్లు చక్కదిద్దుకోవాల్సిందిగా జగన్ కు సుధాకర్ రెడ్డి సలహా ఇచ్చారు. తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ విలేకరుల సమావేశంలో జగన్ తండ్రి YS రాజశేఖర్ రెడ్డి పుట్టుక గురించి ప్రశ్నించారు. YS రాజా రెడ్డికి భార్యగా అర్హతలేని రెండవ భార్య సంతానం రాజశేఖర్ రెడ్డి కదా అని నిలతీశారు. మీకు ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడే అర్హత లేదని ఎద్దేవా వేశారు.