సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు
భారతదేశ ఏకీకరణలో ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి భారతీయ జనతా పార్టీ చిత్తూరు అసెంబ్లీ కన్వీనర్ కడియాల సురేష్ ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ లో నివాళులర్పించింది. జయంతి కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ ..సర్దార్ వల్లభభాయి పటేల్ స్వాతంత్ర్య సమర యోధుడు, స్వరాజ్య ఏకీకరణ చేచేశారని కొనియాడారు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం 520 పైచిలుకు సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత వీరికే దక్కుతుంది.
దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. భారత రాజ్యాంగం రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గా,రాజకీయాలలో కేవలం 40 మాసలే ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని పిలుస్తున్నారు. ఏది ఏమైనా పటేల్ లాంటి ఉక్కుమనిషిని చిరస్మరణీయంగా భారతీయులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్టిబాబు, అసెంబ్లీ కన్వీనర్ కడియాల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి, మీడియా ఇంచార్జ్ రామభద్ర, ఇతర నాయకులు రామమూర్తి, కరుణాకర్ సిద్దు, జ్యోతిశ్వరి, సుబ్బారెడ్డి, భాను ప్రకాష్, కిషోర్ చౌదరి, హరిబాబు చౌదరి, పాండియన్ ,శేఖర్, తోటపాలెం వెంకటేష్, రవి నాయుడు, జయచంద్ర, మునిరాజా , జీకే నాయుడు, సుబ్రహ్మణ్యం, రెడ్డి మస్తాన్, వేలు తదితరులు పాల్గొన్నారు.