2, అక్టోబర్ 2023, సోమవారం

జాతిపిత మహాత్మా గాంధీకి సిపీఐ ఘన నివాళి


మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి  జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని  సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర కార్యదర్శి వి సి గోపీనాథ్ నాయకత్వంలో చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహానికి సిపిఐ  నాయకులు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ .నాగరాజు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు.


ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి అవుతావో, అప్పుడే  పట్టణాలు, నగరాలు కూడా అభివృద్ధి వైపు నడుస్తుందని గాంధీ అన్నారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఫైనాన్స్ నిధులను గ్రామపంచాయతీలు అభివృద్ధి కోసం కేటాయించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ గ్రామాలను అభివృద్ధి చేయడం లేదన్నారు. సంబంధించిన నిధులను కూడా పక్కదారి పట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నుకొనబడిన గ్రామ సర్పంచ్లకు ప్రభుత్వ విధానాల వల్ల గౌరవం పోయిందని, ప్రజల సమస్యలు ఏమి చేయలేని పరిస్థితులు సర్పంచులు కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని  కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు. రాష్ట్రంలో దళితుల పైన, గిరిజనుల పైన, ముస్లింలపైన, క్రిస్టియన్ల పైన జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలని సిపిఐ నాయకులు ప్రతిజ్ఞ  చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వి సీ గోపీనాథ్, కే మణి, బి ఆరుముగం రెడ్డి, కే.విజయ గౌరీ, ఏ జమీలాభి, బి కుమారి, వి కోమల, రోజా తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *