శ్రామికులకు అండ ఏఐటీయూసీ ఎర్రజండ: నాగరాజు
చిత్తూరులో ఘనంగా ఏఐటీయూసీ 104 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) 104వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిత్తూరు ప్రకాశం హై రోడ్ లో ఏఐటీయూసీ నాయకులు దాసరి చంద్ర అధ్యక్షతన ఘనంగా జరిగాయి. సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు యస్. నాగరాజు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1920 అక్టోబర్ 31న భారత దేశంలోనే మొట్టమొదటగా ఏర్పడిన సంఘం ఏఐటియుసి అని కొనియాడారు. భారత దేశ స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఆనాడు కార్మికులకు పనిగంటల కోసం, కార్మికుల చట్టాల కోసం హక్కుల కోసం, కార్మికుల సంక్షేమ కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ ఏర్పడిన జెండా ఏఐటీయూసీ ఎర్రజెండా అన్నారు. 1920 నుండి నేటి వరకు 2023 వరకు భవిష్యత్తులో కూడా శ్రామికుల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం, సంక్షేమం కోసం, శ్రామికుల పక్షాన అండగా ఉంటున్న జండా ఏఐటియుసి ఎర్రజెండా అన్నారు. ప్రస్తుతం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు పట్ల ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 44 కోడ్ లు గా ఉన్న కార్మిక చట్టాలను 4 కోడ్ లు గా కుదించి కార్మిక వర్గానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని కేంద్రలోని బిజెపి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు
సమావేశంలో నాయకులు కే.మణి,దాసరి చంద్ర, వి. సి .గోపీనాథ్ , కే .ప్రేమ, కే .ప్రభావతి , ఎం. నాగరాజు, కే .రమాదేవి, డి.సుగుణ,ఎల్ కృష్ణ లు పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో ఏఐటియుసి అనుబంధ సంఘల నాయకులు జయశంకర్, అరుణ, వినాయక, సుకన్య, పరదేశి, చిత్ర, శోభన్ బాబు, బుల్లెమ్మ, వినోద్ కుమార్, రఘు, గజేంద్ర బాబు, లతా, బాలాజీ రావు, డేవిడ్, లోకనాథం, మున్సిపల్, అంగన్వాడి, మెడికల్, ఐఎంఎఫ్ ఎల్, భవననిర్మాణం, సిమెంట్ స్టీల్ ,హమాలి, సివిల్ సప్లై, నుండి యూనియన్ల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.
ఏఐటియుసి 104వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ,ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏఐటియుసి జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు ఎస్. నాగరాజు, కే .వెంకటేశు, కే. రాధ, కే .జయ చంద్ర, దాసరిచంద్ర, శంకర్ ,రవిచంద్ర రెడ్డి , కత్తి మునిరత్నం, శోభ ,రమాదేవి ,లత,సుబ్రహ్మణ్యం,మణి ,గోపి , నిర్మల, రంజిత, బుజ్జమ్మ రఘుతదితరులు పాల్గొన్నారు.