9, అక్టోబర్ 2023, సోమవారం

చంద్రబాబుకు బెయిలు రావాలని పూజలు

 


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఏ మచ్చ లేకుండా తొందరగా బయటికి రావాలని క్లస్టర్ ఇంచార్జ్ కాజూరు బాలాజీ, డివిజన్ ఇంచార్జ్ శంకర్ మంజుల ఆధ్వర్యంలో సోమవారం 25వ డివిజన్ గిరింపేట శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక పూజలు చేశారు.  ప్రియతమ నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని 116 టెంకాయలు కొట్టారు.  


అలాగే కొవ్వొత్తుల ర్యాలీ, కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,  కాజూరు బాలాజీ, కటారి హేమలత, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు కాజురు రాజేష్,  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా పాల్గొన్నారు. చంద్రబాబు త్వరగా జైలు నుండి బయటకు రావాలని, అయన ఆరోగ్యంగా ఉండలాని శ్రీవెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *