8, అక్టోబర్ 2023, ఆదివారం

రోజాకు మాజీ గవర్నర్ తివారీ గతి తప్పదు !

డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక 



మంత్రి ఆర్ కే రోజాకు మాజీ గవర్నర్ ఎన్ డి తివారీని గతి తప్పదని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. మంత్రిగా ఉన్న రోజా తన పైన వచ్చిన ఆరోపణల నుంచి వ్యక్తి గతం అంటూ తప్పించుకోవటం కుదరదని అన్నారు. 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్న తివారీ సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని పదవి నుంచి తప్పు కున్నారని చెప్పారు. ఒక  మహిళను మోసం చేసిన తివారీని, ఆమె కుమారుడికి తండ్రి అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు.


విదేశాంగ మంత్రిగా, నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన తివారీ  వ్యక్తి గతం అంటూ తప్పించుకోలేక పోయారని  చెప్పారు. కేవలం మహిళ అన్న కారణంతో  తన తప్పులు కప్పి పుచ్చుకోవడం వీలు కాదని చెప్పారు. ఆమె పై ఆరోపణలు చేసిన బండారు సత్య నారాయణను వదిలి పెట్టనని సవాళ్లు విసరడం మాని తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు, వెళ్ళంపల్లి  శ్రీనివాసులు మహిళలకు అర్ధరాత్రి ఫోన్ చేసి వేధించి నప్పుడు రోజా ఎందుకు మాట్లాడ లేదని నిలదీశారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నవ్విన రోజా  ఆ సమయంలో తాను మహిళ అన్న విషయం మరచి పోయారా అంటూ నిలదీశారు. 


రోజా వ్యవహారంలో బయటి సినీ తారలు మద్దతు ఇస్తున్నారు తప్ప రాష్ట్ర మంత్రులు ఎవరు మాట్లాడటం లేదన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఆమెకు అనుకూలంగా మాట్లాడ లేదని తెలిపారు. దీనిని బట్టి ఆమె తప్పు చేసిందని స్వంత పార్టీ వారే నమ్ముతున్నారని అర్థం చేసుకోవాలి అన్నారు. ఆమెకు మద్దతు పలుకుతున్న సినీతారలు నవనీత్ కౌర్, కుష్బూ, రాధిక, మీనా, రమ్య కృష్ణ, లక్ష్మి పార్వతి, శ్రీ రెడ్డి దేవతా స్వరూపులు ఎమీ కాదన్నారు. వారి చరిత్రలు అందరికీ తెలుసని చెప్పారు. ఇప్పటికైనా రోజా మాటలు కట్టి పెట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలని సుధాకర్ రెడ్డి సూచించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *