24, అక్టోబర్ 2023, మంగళవారం

రిసార్టు వ్యవహారంపై లోకేష్ సీరియస్ !?

లోకేష్ కు ఫిర్యాదు చేసిన జిల్లా నేతలు

గాలి భానుప్రకాష్ ను ఓడించడానికి కుట్ర ? 

నివేదిక కోరిన యువనేత 

రంగంలోకి  ఇంటెలిజెన్స్  


రేవా రిసార్ట్స్ లో జరిగిన మంత్రి రోజా భర్త సెల్వమణి పుట్టిన రోజు వేడుకలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయినట్టు తెలిసింది. నిత్యం టిడిపి నేతలను బూతులు తిట్టే రోజా కుటుంబ సభ్యులకు రిసార్ట్స్ ఉచితంగా ఇవ్వడంపై పలు ఆరోపణలు ఆయన దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. నిజానికి ఆమె భర్త పుట్టిన రోజును శనివారం చెన్నైలో జరుపుకున్నారు. అయితే ఆదివారం, సోమవారం టిడిపి నేత రిసార్ట్స్ లో విందులు, వినోదాలతో గడపడం అనుమానాలకు దారి తీసింది. రోజా తన గెలుపుకు అవసరమైన వ్యూహ రచన కోసం రిసార్ట్స్ ను ఎంచుకున్నారని టిడిపి నేతలు కొందరు లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లారు. నగరిలో గాలి భాను ప్రకాష్ కు వ్యతిరేకంగా ఆయన తమ్ముడు జగదీష్ ను రంగంలోకి దింపడానికి ఆమె చిట్టిబాబు నాయుడు సహాయం కోరినట్టు సమాచారం. వారి పోటీకి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారని అంటున్నారు. 



చిట్టి బాబును తొలి నుంచి వైకాపా నేతలు తమ కోవర్టుగా వాడుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్న విషయం అందరికి తెలుసు. చిట్టిబాబు తీరు నచ్చక పోవడంతో పెనుమూరు మండలానికి చెందిన  ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి నియోజక వర్గానికి రావడమే మానేశారు. ఇటీవల అయన తన సభ్యత్వాన్ని తిరుపతికి మార్చుకున్నారు. అలాగే ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు ఆయనపై గతంలో ఫిర్యాదులు చేశారు. అయితే పార్టీ రాయలసీమ వ్యవహారాలు పర్యవేక్షించే  కుమార్ చౌదరి ఆయనను కాపాడుతూ వచ్చారని తెలిసింది. నియోజక వర్గం కో ఆర్డినేటర్ గా తొలగించిన తరువాత చౌదరి సహాయంతో చిట్టిబాబు రాష్ట్ర ప్రతిభశీలుర కమిటీ సభ్యునిగా నియమితులు అయ్యారు. రోజా వ్యవహారంపై జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత ఒకరు, గాలి భాను ప్రకాష్ లోకేష్ కు ఫిర్యాదు చేశారని తెలిసింది. ఎన్ బి సుధాకర్ రెడ్డి  రిసార్ట్స్ రహస్యం చెప్పాలి అంటూ రోజాను డిమాండ్ చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు జిల్లాలోని రాజకీయ వర్గాలలో రోజా రిసార్ట్స్ రహస్యం హాట్ టాపిక్ గా మారింది.


ఈ నేపథ్యంలో చిట్టిబాబుపై గతంలో వచ్చిన ఆరోపణలు అన్నింటిపైన సమగ్ర సమాచారం ఇమ్మని లోకేష్ కార్యాలయ సిబ్బందిని అడిగినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా  ఇంటెలిజెన్స్ శాఖ కూడా దీనిపై ఆరా తీయడం ప్రారంభించింది. ప్రతి పక్ష నేత రిసార్ట్స్ లో రోజా రెండు రోజులు ఉండటంలోని ఆంతర్యం ఏమిటని ఆరా తీస్తున్నారు. నగరిలో రోజాను గెలిపిస్తే జి డి నెల్లూరు నియోజక వర్గంలో నారాయణ స్వామి ఓటమికి తన వంతు సాయం చేస్తానని రోజా టిడిపి నేతలకు హామీ ఇచ్చిందని వైకాపా నేతలు కొందరు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం  ఇంటెలిజెన్స్ వర్గాలు పలువురిని కలసి సమాచారం సేకరించినట్టు  తెలిసింది. మొత్తం మీద రిసార్ట్స్ వ్యవహారం రెండు పార్టీలలో ప్రకంపనాలు సృష్టిస్తోంది.


తాజా సమచారం మేరకు మంత్రి రోజా, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం కూడా రిసార్టులోనే ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో నియోజకవర్గానికి చెందిన తెదేపా కీలకనేత ఒకరు మంత్రిని కలిసినట్లు తెలుస్తుంది. ఆ నేత సోమవారం సాయంత్రం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి స్వాగతం చెప్పడానికి తిరుపతి వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత రిసార్టుకు వెళ్లి మంత్రి రాజాతో సుదీర్ఘ మంతనాలు జరిపారని స్థానికులు అంటున్నారు. అయితే ఈ విషయం దృవీకరణ కావాల్చిఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *