ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయకపోతే సమ్మె కు సిద్దం.
ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి
అంగన్వాడీలకు తెలంగాణ లాగా జీతాలు ఇవ్వాలి
రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని, తెలంగాణ లాగా జీతాలు అంగన్వాడీలకు పెంచాలని ఆదివారం చిత్తూరులో యూటీఎఫ్ కార్యాలయంలో ఎ.పి.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం శ్యామల అధ్యక్షత న జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేం అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు పట్టించుకోకపోవడం దారుణం. రాష్ర్ట ప్రభుత్వం అంగన్వాడీల దగ్గర అన్ని ప్రభుత్వ పనులు చేయించుకుంటూ వారి సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో శిశు మరణాలు రేటు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది అంగన్వాడీలు. మరి ఇలాంటి పథకాన్నికి నిధులు తగ్గించడం సిగ్గుచేటు. నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను రకరకాల పద్ధతుల్లో వేధించడం మానుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోరాటం చేస్తుంటే ఉక్కు పాదంతో అణచివేయడం ఏమిటి ప్రశ్నించారు.ప్రజా ఉద్యమాలను అణచిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదు. మహిళలను రాత్రిలో కూడా మహిళలను పోలీస్ స్టేషన్లో పెట్టడం దారుణం. కొత్త కొత్త యాప్ లు పెట్టి అంగన్వాడీలకు మానసిక ఒత్తిడి తీసుకురావడంతో అనారోగ్య సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి. వీటితో పాటు అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వాలని, మినీ వర్కర్ ను మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో వున్న స్థానిక సమస్యలపై రెగ్యులర్గా పోరాటాలు నిరంతరం చేయాలి. ప్రజలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం చాలా నాసిరకంగా ఉండడంతో వారు అంగన్వాడీలపై ఒత్తిడి చేస్తున్నారు. అందుకే యూనియన్ మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి , జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, యూనియన్ జిల్లా నాయకులు పద్మ, పంచవర్ణ, ప్రమీల, మమత, లీలాలతో పాటు జిల్లాలో వున్న 12 ప్రాజెక్టు నాయకత్వం నాయకులు హాజరయ్యారు.