29, అక్టోబర్ 2023, ఆదివారం

శోభనం రాత్రి వరుడు పరార్


 కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ఫస్ట్‌నైట్‌ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం చోటు చేసుకుంది. ఒక వరుడు తనకోసం ఎదురు చూస్తున్న నవ వధువు నుంచి తప్పించుకుని పొరుగింట్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అవును, ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్థానిక వార్తాపత్రిక ఇలాంటి వింత సంఘటన గురించి వెల్లడించింది. తాజాగా ఓ దినపత్రికలో ప్రచురించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లైన వరుడు ఫస్ట్‌నెట్‌ రోజు రాత్రి ఇంట్లోకి పారిపోయి పక్కింట్లో దాక్కున్నాడు. దీనికి కారణం అతని సిగ్గుపడే స్వభావమేనట.


మీడియాలో వచ్చిన వార్త ఆధారంగా.. వరుడు మొదటి రాత్రి ఉన్నట్టుండి ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. వరుడి ఆచూకీ తెలియక ఆందోళన చెందిన కుటుంబీకులు రాత్రంతా వెతికారు. కానీ, అతడు ఎక్కడా కనిపించలేదు.. పైగా తన మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి పెట్టుకున్నాడు. చివరకు తెలిసిందేంటంటే.. అతను పొరుగువారి ఇంట్లో దాక్కున్నాడని.


రాత్రంతా వెతికిన కుటుంబ సభ్యులకు వరుడి ఆచూకీ దొరక్క ఆందోళనపడ్డారు. కానీ, ఆ మరుసటి రోజు ఉదయం అతను తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు, అతని కుటుంబ సభ్యులు అతనిని సంప్రదించారు. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. ‘నాకు సిగ్గుగా ఉంది’ అన్నాడట.. అంతేకాదు.. రాత్రి పూట ఇంటికి తిరిగొచ్చేంత ధైర్యం లేదని తేల్చి చెప్పాడు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *