19, అక్టోబర్ 2023, గురువారం

పారిశుధ్య కార్మికులు పస్తులతో చావలా? బతకాలా?

 


గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు అధికారులు  బకాయిలు జీతాలు ఇస్తారా? వారిని కుటుంబాలతో సహా చావమంటారా? అని జిల్లా అధికారులను  ఏ ఐ టి యు సి (AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు యస్ నాగరాజు సూటిగా ప్రశ్న ప్రశ్నించారు. గురువారం చిత్తూరు జిల్లా గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్లో ఉన్న  20,25 నెలల బకాయి జీతాలను చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రన్, జిల్లా కార్యదర్శి ఎస్ గోవిందస్వామి నాయకత్వంలో  చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  నిరసన కార్యక్రమం జరిగింది.


 ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి టీ కాదండయ్య మాట్లాడుతూ కార్మికులకు సుమారు 20,25 నెలలు జీతాలు పెండింగ్లో ఉంటే ఆ కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలి, పిల్లలను ఏ విధంగా చదివించుకోవాలి,  ఎలా మనుగడి సాధించాలని ఆవేదన వ్యక్తపరిచారు. 20 నుండి 25 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ దృష్టికి, డిపిఓ తీసుకెళ్లిన ఇప్పటికీ  వరకు జీతాలు చెల్లించకపోవడం చాలా అన్యాయం అన్నారు. జిల్లా వ్యాప్తంగా మంత్రులు, ముఖ్యమంత్రులు సమావేశాలు జరిపినప్పుడు మాత్రం కార్మికులను రాత్రి పగలు పని చేయించుకోవడం కనీసం వారికి బస్ చార్జీలు కూడా  ఇవ్వకుండా పనులు చేయించుకోవడం ఎంతవరకు న్యాయం అని నిలతీశారు. అనేక సందర్భాలలో జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి  తీసుకొచ్చినప్పుడల్లా 15 రోజుల్లో జీతాలు వేస్తామని హామీ ఇవ్వడం, తర్వాత అధికారులు మర్చిపోవడన్ని తీవ్రంగా విమర్శించారు.


 రోజు రోజుకు  నిత్యవసరదారులు పెరుగుతున్నా, వేతనాలు పెరగకపోవడంతో నిత్యావసరాలు కనీసం కొనుక్కొని తినే పరిస్థితుల్లో గ్రీన్ అంబాసిడర్ కార్మికులు  లేరు అని ఆవేదన వ్యక్తం చేశారు.  పనులు మాత్రం చేయించుకుంటున్నారనీ, జీతాలు అడిగితే పని నుండి నిలిపివేస్తామని అధికారులు బెదిరించడం సరికాదన్నారు. ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం విడుదల చేసిన  680 జీ.వో ప్రకారం 10,000 రూపాయలు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్ కార్మికులకు గుర్తింపు కార్డుతో పాటు, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, రాజకీయ వేదింపులను అరికట్టాలని  డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ .నాగరాజు  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆంటు రోగాలు వ్యాప్తి చెందకుండా గ్రామాన్ని పరిశుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ తున్న  గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు 20 - 25 నెలల బాకాయి జీతాలు ఇవ్వకపోతే కార్మికుల కుటుంబాలను బతకమంటారా? చావమంటారా ?అని జిల్లా అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి  జోక్యం  చేసుకొని గ్రీన్ అంబాసిడర్ కార్మికులు చెల్లించవలసిన పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కే . మణి, గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేంద్ర, గోవింద్ స్వామి నాయకులు యేసు పాదం, రవి, కృష్ణయ్య , కుమార్, దండమ్మ, పద్మ, కృష్ణయ్య, సురేష్, బాలయ్య, సంజీవి తదితరులు కార్మికులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *