17, అక్టోబర్ 2023, మంగళవారం

నారాయణా! నీకిది తగునా?

నారాయణస్వామిపై భగ్గుమన్న TDP, జనసేన 

నారాయణస్వామి ఫోటోను చెప్పుతో కొట్టిన అనిత 

నారాయణస్వామిని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు



ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబు భార్య భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. టిడిపి నేతలు చెప్పుతో కొడతామని  హెచ్చరికలు చేసే స్థాయికి చేరాయి. ఆయన స్వంత నియోజక వర్గం జి డి నెల్లూరు టిడిపి నేతలు ఎప్పుడు లేనంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీరికి జనసేన నేతలు అండగా నిలిచారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారాయణస్వామిని అరెస్ట్ చేయాలని కోరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ థామస్ ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. భువనేశ్వరికి బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర తెలుగు మహిళందరు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటిని ముట్టడిస్తామని టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి హెచ్చరించారు. నారా, నందమూరి కుటుంబాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భువనేశ్వరి గురించి ఎవరు మాట్లాడినా చెప్పుతో కొడతామంటూ పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం చిత్తూరు వెంగళరావు కాలనీలో మహిళలు నారాయణ స్వామి ఫోటోలను చీపుర్లతో కొట్టారు. 

సోమవారం నారాయణ స్వామి మాట్లాడుతూ జైలులో ఉన్న చంద్రబాబుకు తాము ఎలాంటి హానీ తలపెట్టమని చెప్పారు. అయితే రోజు అన్నం పంపే ఆయన భార్య భువనేశ్వరి విష ప్రయోగం చేసి చంపే అవకాశం ఉందని అన్నారు. తన కుమారుడు లోకేష్ ను ముఖ్య మంత్రి చేయడానికి ఆమె భర్తను కూడా చంపడానికి సిద్దం అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదని భువనేశ్వరి చెప్పడాన్ని తప్పుబట్టారు. ఆమె డాక్టర్ కాదు కదా అంటూ ప్రశ్నించారు. అక్రమాలు చేసినందుకే చంద్రబాబు జైలులో ఉన్నారని చెప్పారు.

 రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత 

ఈ వ్యాఖ్యలు టిడిపి వర్గాలలో బగ్గు మన్నాయి. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నారాయణ స్వామి తీరు మార్చుకోక  పోతే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. ఆమె మరి కొందరు కలసి నారాయణ స్వామి ఫోటోలను చెప్పులతో కొట్టారు. ఫోటోలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. సజ్జల కాళ్ళ దగ్గర ఉండే దళిత మంత్రి.. అమ్మలాంటి భువనేశ్వరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘భువనేశ్వరి పుడ్‌లో విషం పెతుతుందని అంటారా?.. బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?.. చంద్రబాబు ఆరోగ్యంపై ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి. భువనేశ్వరి గురించి.. మీకు ఏమి తెలుసు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు?. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎంతో మందికి భువనేశ్వరి ఎన్నో సేవలు అందిస్తున్నారు.. ఈ విషయం మీకు తెలుసా?. ఎపుడూ ఆమె రాజకీయాలలోకి రాలేదు.. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారు కాబట్టి బయటకు వచ్చారు’’ అని అనిత పేర్కొన్నారు. ఈ సారి నేరుగా మనిషినే కొడతామని హెచ్చరించారు. నారాయణ స్వామి ఫ్యాక్షన్  నాయకుడు అయిన జగన్ ప్రభావం వల్ల అందరూ అలాగే ఉంటారని భ్రమ పడుతున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విమర్శించారు. నారాయణ స్వామి తక్షణం భువనేశ్వరికి క్షమాపణ చెప్పాలని కోరారు. 




నియోజక వర్గం టిడిపి ఇంచార్జి డాక్టర్  ఆధ్వర్యంలో టిడిపి నేతలు నారాయణ స్వామిపై ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నారాయణ స్వామిని ఆయన భార్య చంపే ప్రమాదం ఉందన్నారు. నర్సు అయిన ఆమె సులభంగా విష ప్రయోగం చేయగలదని చెప్పారు. చంద్రగిరి, తిరుపతి నియోజక వర్గాల ఎమ్మెల్యేలు తమ వారసులకు టిక్కెట్లు ప్రకటించారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి వారసులు కూడా టిక్కెట్టు ఆశించి ఆయనను చంపే అవకాశం ఉందన్నారు. జనసేన నియోజక వర్గం ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ మాట్లాడుతూ నారాయణ స్వామి ఓటమి భయంతో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని  అన్నారు. నియోజక వర్గానికి పరిమితమైన స్వామి ఉప ముఖ్య మంత్రి అని చెప్పు కోవడం సిగ్గు చేటు అన్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారాయణస్వామిని అరెస్ట్ చేయాలని కోరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ థామస్ ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్టీఆర్ బొమ్మని పెట్టుకొని ఎలక్షన్స్‌కి వస్తున్నారు అంటున్నావ్. నువ్వు వైయస్సార్ బొమ్మ లేకుండా స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధం.. నువ్వు మగాడివైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యి అని థామస్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యదర్శి వి హరిబాబు, రాష్ట్ర తెలుగు యువత మాజీ ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి నాయుడు, ఎస్ ఆర్ పురం మండల కమిటీ అధ్యక్షుడు జి జయశంకర్ నాయుడు, కార్వేటినగరం మండల కమిటీ అధ్యక్షుడు చెంగల్రాయ మందడి, వెదురుకుప్పం మండల కమిటీ అధ్యక్షుడు కె లోకనాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి

చంద్రబాబు నాయుడుకి అతని భార్య భువనేశ్వరి వల్లే ప్రమాదం ఉందని,  వారే విష ప్రయోగం చేస్తారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి మండిపడ్డారు.  నేడు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న చరిత్ర లోకేష్ ది అని,  తన తండ్రి చావును అడ్డు పెట్టుకుని అధికారం కోసం శవం వద్ద ఎమ్మెల్యేలతో సంతకం చేయించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు.  వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భువనేశ్వరిపై  నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆమెకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. భువనేశ్వరికి బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర తెలుగు మహిళందరు  డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షురాలు కార్జాల అరుణ

పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ మాట్లాడుతూ నారా కుటుంబ జోలికి వస్తే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. భువనేశ్వరే నారా చంద్రబాబును చంపే అవకాశాలు ఉన్నాయని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షురాలు కార్జాల అరుణ తీవ్రంగా ఖండించారు. నారా, నందమూరి కుటుంబాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భువనేశ్వరి గురించి ఎవరు మాట్లాడినా చెప్పుతో కొడతామంటూ ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.

చిత్తూరులో చీపుర్లతో సన్మానం 

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబు భార్య భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం చిత్తూరు వెంగళరావు కాలనీలో మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో నారాయణ స్వామి ఫోటోలను చీపుర్లతో కొట్టారు. మరో సారి భువనేశ్వరి జోలికి వస్తే నేరుగా ఇంటికి వచ్చి కొడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రియ, నారాయమమ్మతో పాటుపలువులు మహిళలు పాల్గొన్నారు.







అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *