పగలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో కయ్యము, రాత్రి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో నెయ్యము అన్నచందంగా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తయారైందని ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సమావేశంలో అన్నారు. జిల్లాలో పలువురు నాయకులు దానిని నిజం చేస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు అర్థమవుతుంది. చిత్తూరు జిల్లాలో చాలామంది తెదేపా నాయకులు వైసీపీ నాయకులకు కోవర్టులుగా పని చేస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. వాటిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక హెచ్చరికగా పట్టించుకున్నట్లు లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఎలా ఉందంటే మేము కొట్టినట్లు నటిస్తాము మీరు ఏడ్చినట్లు నటించండి అన్నట్లుగా జిల్లాలో పరిస్థితి ఉంది. జిల్లాలో చాలామంది టిడిపి నాయకులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి వారి అండదండలతో అక్రమ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు.
పాలసముద్రం మండలంలోని ఒక రిసార్టులో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా భర్త సెల్వమణి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. జన్మదిన వేడుకలను ఎవరు ఎక్కడైనా జరుపుకోవచ్చు. అయితే ఆ జన్మదిన వేడుకలు ఒక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత రిసార్ట్ లో జరిగడం, అయన ఆతిధ్యం ఇవ్వడం వివాదాస్పదం అయ్యాయి. పార్టీలో ఆ నేత పాల్గొనకపోయినా, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ ఆ నేత తన అనుచరులను పురమని పురమాయించి చేపించినట్లు సమాచారం. సెల్వమణి జన్మదిన వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగెటట్లు ఏర్పాటు చేశారు. రోజా, సెల్వమణి, వాళ్ళ బంధుమిత్రులకు ఘనంగా ఆతిధ్యం ఏర్పాటు చేశారు. బహుమతులు అందచేశారు. ఈ వార్త నియోజకవర్గంలో దాటి జిల్లా వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.
మంత్రి ఈ రోజా అనునిత్యం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కొడుకు లోకేష్ మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు మిఠాయిలు పంచి పండగ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడును వెధవ అంటూ కూడా సంభోదిస్తున్నారు. ఇక పత్రికా విలేకరుల సమావేశంలో లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణిలను నానా దుర్బాసలాడుతున్నారు. అటువంటి రోజాకు, ఆమె భర్తకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత ఆతిధ్యం ఇవ్వడం ఏమిటని నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రిసార్ట్ కు పర్యాటక శాఖ అనుమతి కోసమే ఈ తతంగమంతా జరిగిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పాలసముద్రం మండలంలోని రాష్ట్ర ప్రభావశీలుర కమిటీ సభ్యుడు భీమినేని చిట్టిబాబు నాయుడు రేవా రిసార్ట్ లోమంత్రి రోజా భర్త ఆర్ కే సెల్వమని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయని తెలిసింది. ఆయన పుట్టిన రోజు శనివారం కావడంతో చెన్నైలోని ఆయన ఇంటిలో సదా సీదాగా జరుపుకున్నారని తెలిసింది. ఆదివారం పాలసముద్రం "రేవా రిసార్ట్స్ లో" భారీస్థాయిలో విందు వినోదాలు ఏర్పాటుచేశారు. చెన్నై చుట్టూ వందలాది హోటళ్ళు, రిసార్ట్స్ ఉండగా పాలసముద్రంలో ఉన్న టిడిపి నేత రిసార్ట్ లో విందు కార్యక్రమాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి రోజు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసే రోజాకు చిట్టిబాబు వసతి కల్పంచడం ఏమిటని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పైగా అన్ని ఖర్చులు కూడా ఆయనే భరించారు అన్న వార్తలు వచ్చాయి. ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమంటే ఆ రేవా రిసార్ట్స్ ను టూరిజం శాఖగా అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు సాగాయని తెలుస్తోంది.
ఇందులకు కారణం చిత్తూరు పార్లమెంటు యువత ప్రధాన కార్యదర్శి బీగాల రమేష్ కు మంత్రి రోజాకు సన్నిహిత సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల బీగల రమేష్, చిట్టి బాబు నాయుడు, ఇటీవల మంత్రి రోజాను ఎక్కడో రహస్యంగా కలిసి ఆ రేవా రిసార్ట్స్ కు టూరిజ శాఖ అనుమతులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ జన్మదినం వేడుకలకు చెన్నై నుంచి వచ్చిన రోజా కుటుంబ సభ్యులు, స్నేహితులకు కావాల్సినవి అన్నీ చిట్టిబాబు అనుచరులు, రిసార్ట్స్ సిబ్బంది దగ్గర ఉండి చూసుకున్నారని తెలిసింది. తొలి నుంచి చిట్టిబాబు వైకాపా నేతలతో సన్నిహితంగా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన వైసిపి కోవర్టు అంటూ అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు కూడా పోయాయి. కాగా ఆయన వ్యవహారాలు నచ్చకపోవడంతో ఆరుగురు మండల కమిటీ అధ్యక్షులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
ఆదివారం రోజా కార్యక్రమాల విషయం కూడా కొందరు అధిష్ఠాన వర్గం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఫోటోలు, వీడియోలు తీయడానికి ఎవరిని అనుమతించక పోవడం కూడ అనుమానాలకు దారి తీస్తోంది. అన్నీ కార్యక్రమాల సమాచారం సోషల్ మీడియాలో పెట్టే రోజా ఈ కార్యక్రమం వ్యవహారం రహస్యంగా ఉంచడంలోని అంతర్యం ఏమిటని పార్టీ వారే నిలదీస్తున్నారు.