ముడుపులకు పన్ను కట్టాలని చంద్రబాబుకు ఐటీ నోటీసులు
రూ.118 కోట్ల ముడుపులు ముట్టాయి కదా?
ఈ వ్యవహారంలో నడిచిన పలు మెసేజీలు, చాటింగ్‌లు, ఎక్సెల్ షీట్లను ఎంవిపి కార్యాలయాల నుంచి ఐటీ శాఖ సోదాల్లో స్వాధీనం చేసుకుంది. పలు ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీల నుంచి నిధుల మళ్లింపుపై ఆధారాలను సేకరించినట్లు పేర్కొన్నారు. రకరకాల పద్ధతుల్లో సేకరించిన నగదును అక్రమ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడుకు చేరినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఎంవిపి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌కు 2016 నుంచి సంప్రదింపులు చేస్తున్నట్లు ఐటీ దర్యాప్తులో గుర్తించారు. తెలుగు దేశం పార్టీ కోసం నిధులు సమకూర్చాలని ఎంవిపిని కోరిన మెసేజీలను కూడా ఐటీ శాఖ గుర్తించింది. 2019 నవంబర్ 1 , 5 తేదీలలో నమోదు చేసిన స్టేట్‌మెంట్‌లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షపోర్‌జీ పల్లోంజీ సంస్థకు కేటాయించిన పనుల్లో నిధుల్ని మళ్లించినట్టు అంగీకరించాడు.
షపోర్‌జి పల్లోంజి సంస్థతో పాటు ఎల్ అండ్ టి సంస్థ నుంచి సేకరించిన నిధుల్ని కూడా ఫినిక్స్ ఇన్‌ఫ్రా, పౌర్ ట్రేడింగ్ సంస్థల ద్వారా మళ్లించినట్లు గుర్తించినట్లు చంద్రబాబు నాయుడకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ విచారణ సందర్భంగా ఎంవిపిని విచారించిన సమయంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించడంతో లావాదేవీలు జరిగిన తీరును అతని పూర్తిగా బయటపెట్టాడు. మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి నిధులు మళ్లింపు జరిగిన తీరును వివరించాడు. కాంట్రాక్టు సంస్థ నుంచి నిధులను తీసుకుని వాటిని పిఏ శ్రీనివాస్‌కు అందించినట్టు గుర్తించారు. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్టుల కేటాయింపు పూర్తిగా బోగస్‌గా గుర్తించారు. బోగస్ వర్క్ ఆర్డర్లతో పనుల్ని కేటాయించినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు అంతిమంగా లబ్ది కలిగినట్టు ఐటీ శాఖ భావిస్తోంది. సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎంవిపి మళ్లించి చంద్రబాబు నాయుడుకు చెల్లించిన నగదు రూ.118,98,13,207ను 2020-21 సంవత్సరాల్లో వెల్లడించని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఆగష్టు4న ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.