రాజకీయంగా గ్రేట్ సస్పెన్స్ కు తెరపడింది. రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిలుస్తున్నాయి. అధికార YSR కాంగ్రెస్ పార్టీలో నిరాశా, నిసృహాలు అలముకోన్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన పొత్తు ఊగిసలాటలో ఉండింది. జనసేన NDA భాగస్వామ్య పక్షం కావడంతో రాష్ట్రంలో BJPతో కలిసి ఎన్నికలకు వెళ్తాయని పలువురు భావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు దీనిపై విస్పష్టమైన ప్రకటన చేయలేదు. ఒకసారి తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్తాయని అంటారు, మరోసారి భారతీయ జనతా పార్టీతో ఎన్నికలకు వెళ్తామని అంటారు. దీంతో రాజకీయంగా రాష్ట్రంలో డోలాయమాన పరిస్థితి నెలకొంది. జనసేన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ ఏరోజు ఏ ప్రకటన చేస్తారో తెలియకుండా తెలుగు దేశం పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి ఎంత దగ్గర కావాలని చూసినా, బిజెపి మాత్రం తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టింది. జనసేనతోనే తన ప్రయాణం అంటూ ప్రకటించింది. దీంతో రానున్న ఎన్నికల్లో జనసేన, బిజెపి ఒక కూటమిగా, తెలుగుదేశం, వామపక్షాలు ఒక కూటమిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతాయని భావించారు. గురువారం ఈ ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ తెర దించారు. తాము దేశం పార్టీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తాయని స్పష్టంగా ప్రకటించి, రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. పవన్ నోట ఈ ప్రకటన విన్న వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనంద ఉత్సాహాలతో పరవాళ్ళు తొక్కాయి. గెలుపు లాంచనమేనన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో నెలకొంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇగురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ కూడా ఉన్నారు. దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్నది తన కోరిక అన్నారు. బీజేపీ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదన్నారు. అరాచకాన్ని అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేయడం సరికాదని, సమిష్టిగానే ఎదుర్కోవాలన్నారు. వైసీపీ దుష్టపాలనను ఏపీ ప్రజలు సహించలేకపోతున్నారని అన్నారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhLFXnNmRv2BUc7L52Yc94Ump7pXIY3snXMLt3KFL6b0uo8HjBgecVTcDNKKV5tXoddosFdB_BKcOJbwZ3xVYXeq5Zoqhs--EW8bHWYqs56Gvq6NyUe4MWNg7BlqgSWwjvqE_7D_0SljbEVhu8nxq5c98bcB1koXqyFccznymLkSGPIRdcTmjIF3auMGOc/s320/WhatsApp%20Image%202023-09-14%20at%201.56.03%20PM.jpeg)
తనలాంటి వ్యక్తిని తెలంగాణ సరిహద్దుల్లో 200 మంది పోలీసుల్ని పెట్టి ఆపారంటే సామాన్యుడి పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. తనను కూడా రాష్ట్రంలోకి రానివ్వలేదన్నారు. మొన్నటి దాకా తాను ఏ నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇప్పుడు జనసేన-టీడీపీ కలిసి వెళ్తాయని ప్రకటించారు. ఇది తమ ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించిది కాదని, ఏపీ భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. ఏపీలో అన్ని వ్యవస్ధల్ని దోచుకున్న వ్యక్తుల్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పవన్ తెలిపారు. జగన్ నీకు ఆరునెలలు మాత్రమే ఉన్నాయని, ఈ విషయాన్నీ జగన్ మద్దతుదారులు గుర్తుంచుకోవాలని పవన్ సూచించారు. మీకు యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తామన్నారు. జగన్ కు మద్దతివ్వాలా లేదా అనేది పోలీసులు, రాష్ట్ర అధికారులు నిర్ణయించు కోవాలన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఓ మాజీ సీఎంని మీరు రిమాండ్ లో కూర్చోబెట్టినప్పుడు మీ పరిస్దితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. బీజేపీ కూడా దీనికి కలిసి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో భేటీ అయినపుడు ఆయనకు ఇలాంటి దుస్ధితి రావడం బాధాకరమని చెప్పానన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశానన్నారు. తనకు ఎలాగో భద్రత లేదని, జైల్లోనూ చంద్రబాబుకు భద్రత లేదన్నారు. దీనిపై అమిత్ షా, ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని పవన్ అన్నారు. రేపటి నుంచి జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉంటుందో నిర్ణయిస్తామన్నారు. ఏపీ దుస్ధితిని ఇరు పార్టీల నాయకులకు వివరించి, వారిని ఎన్నికలకు సంసిద్ధం చేస్తామన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి పనిచేస్తామన్నారు. అలాగే ప్రధాని, గవర్నర్, అమిత్ షాలను కలిసి పరిస్దితి వివరిస్తామన్నారు. ఆ తర్వాత ఎలా పోటీ చేయాలన్న దానిపై ఆలోచిస్తామన్నారు. ప్రస్తుతం ప్రజలకు భరోసా కల్పించడమే తమ లక్యంగా పేర్కొన్నారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiYVbhZ-BAG5yTe5sc81biBfHj8ySOjnIxC0lFDHxbGFus-5QN3evEIkdvHYGnJQ6Z0LgeNp_v1ZpeUHbFKtZbztbtuLfGOMBfyxxaPc7C-uJhSCWO-05NswGlX1JoIMIuhP8k0m3mRK3dw_zoRMOeAJtuJFqktJ_g-fyeGuQe3eTmEQVNjNCvRYA5twuI/s320/WhatsApp%20Image%202023-09-14%20at%204.55.43%20PM.jpeg)
తప్పుడు కేసులు ఎదుర్కొంటూ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి సంపూర్ణ సంఘీభావం తెలియజేయడం పట్ల చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు సృష్టించినా, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలియజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అలగే చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరిని, బ్రాహ్మణినీ కూడా కలిసి సంపూర్ణ సంఘీభావం తెలియజేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ఇతర మిత్ర పక్షాలతో కలిసి ఈ రావణ రాజ్యాన్ని, ఈ రౌడీ రాజ్యాన్ని కూల్చడం ఖాయం అని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకుడు జైపాల్, మైనార్టీ సెల్ పార్లమెంట్ సెక్రటరీ షబ్బీర్ భాష, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకుడు కందస్వామి పాల్గొన్నారు.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT US ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.