19, సెప్టెంబర్ 2023, మంగళవారం

తెదేపా నాయకులు గుళ్ళకు వెళ్ళకుండా ఆంక్షలు !

తిరుపతిలో తెదేపా నేతల హౌస్ అరెస్టు 
బుద్ధా వెంకన్న, కోల్లు రవీంద్ర అరెస్టు 
ఆటోలో గుడికి వెళ్ళిన దేవినేని ఉమా 
జగన్ మీద మండిపడుతున్న తెదేపా శ్రేణులు 



టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ టీడీపీ నేతల పూజలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. గుడికి బయలుదేరిన కార్యకర్తలను, నాయకులను  ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి కూడా పోలిసుల అనుమతి తీసుకోవలా? అని తెదేపా నాయకులూ మండిపడుతున్నారు. జగన్ కు హిందూ దేవుళ్ళు అంటే నమ్మకం లేదు. ఏనాడూ గుడికి వెళ్ళలేదు. మేము కూడా గుడికి వెళ్ళకూడదా అని నిలతీస్తున్నారు. పోలిసుల అంక్షలు దాటుకొని కొందరు వెళ్లి పూజలు చేశారు. చంద్రబాబు త్వరగా జైలు నుండి తొందరగా వెలుపలికి రావాలని మొక్కుకున్నారు. అయన ఆరోగ్యంగా ఉండాలని పూజించారు. 




తిరుపతిలో తెదేపా నాయకులను హౌస్ అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. జగన్ తిరుమల పర్యటన కారణంగా ఎవరూ ఇంటి నుండి బయటకు రాకుడదని అంక్షలు విధించారు. విజయవాడలోని వినాయకుడి గుడి వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని వినాయకుడి గుడి వద్దకు దేవినేని ఉమా చేరుకున్నారు. ఎవరికీ కంటపడకుండా ఆటోలో వచ్చి వినాయకుడి దర్శనం చేసుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్‌తో పాటు పలువురిని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దే ఆపేశారు.



విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో కొబ్బరికాయలు కొట్టేందుకు, చంద్రబాబు బయటికి రావాలని కోరుకునేందుకు గుడికి బయలుదేరిన బుద్ధ వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. టిడిపి నేత బుద్ధ వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టేందుకు బయలుదేరిన టిడిపి నేతలు బుద్ధ వెంకన్నను అరెస్ట్ చెయ్యటంతో టిడిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బుద్ధ వెంకన్నను అరెస్ట్ చేయడానికి గల కారణం చెప్పమని టిడిపి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల జీపులకు వారి వాహనాలను అడ్డుపెట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. 




దుర్గ గుడికి వెళ్లి రావడానికి పోలీసుల అనుమతి కావాలా అంటూ టిడిపి నేతలుపోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత జరుగుతున్న నిరసన కార్యక్రమాలను పోలీసులు కావాలని నీరు గారుస్తున్నారని టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నేతలు మండిపడ్డారు. పోలీసుల అరెస్ట్ చేయడంతో అమ్మవారి ముందు కొట్టాల్సిన కొబ్బరికాయలను పోలీసులు ముందే కొట్టి బుద్ధ వెంకన్న నిరసన వ్యక్తం చేశారు.



విజయవాడలోని మాచవరం దేవాలయానికి వెళ్లడానికి ప్రయత్నం చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టిడిపి నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో, ఆయన పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతి కావాలా అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లేక రాజారెడ్డి రాజ్యాంగమా అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, అరెస్ట్ లతో ఏపీలో గందరగోళం నెలకొంది.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *