నేతల అరెస్టులు- పోలీసుల దౌర్జన్యం- ఆగని దీక్షలు
దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరులో రెండవ రోజు కూడా ఆందోళనలు పోటెత్తాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని, నల్ల కండువాలు ధరించి నిరసనలు తెలియజేశారు. నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన నిరాహార దీక్షా శిబిరాల్లో భారీ ఎత్తున తెదేపా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తొలిత నిరాహార దీక్షలకు అనుమతించిన పోలీసులు ఉదయానికల్లా మాట మార్చారు. నిరాహార దీక్షలకు అనుమతి లేదని నిరాహార దీక్షలు చేయడానికి వీలులేదని ఉహుం జారీ చేశారు. దీంతో నియోజకవర్గాలలో నాయకుల ఇంటి వద్దనే నిరాహార దీక్షలు జరిగాయి. తొలుత చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేయాలని భావించి పోలీసు అనుమతి తీసుకున్నారు. చివరి నిమిషంలో పోలీసులు అడ్డు చెప్పడంతో దీక్షా శిబిరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు మారింది. అలాగే పలమనేరు నియోజక వర్గానికి చెందిన నాయకులందరూ పలమనేరు క్లాక్ టవర్ దగ్గర శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసులు ఆ శిబిరాన్ని గిరించడంతో మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇంటి దగ్గర నిరాహార దీక్షలను చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి సతీమణి రేణుక రెడ్డిని ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే కుప్పంలో కూడా నిరాహారదీక్ష శిబిరాన్ని పోలీసులు ఉదయం తొలగించారు. దీంతో పోలీసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో MLC కంచర్ల శ్రీకాంత్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే శ్రీకాళహస్తిలో కూడా తీవ్ర ఉద్యత్తి ఉద్రిక్తత నెలకొంది. సామూహిక నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకొని పోలీసులు దీక్షను భగ్నం చేశారు. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టిడిపి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షను పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ రామచంద్ర నాయుడు, సీనియర్ నాయకులు ఆర్.వి. బాలాజీ, పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ, ఆర్.బి.సి కుట్టి, సోమశేఖర గౌడు, నాగరాజు రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరిబాబు, ప్రతాప్ రెడ్డి,గణేష్, సుబ్రహ్మణ్యం శెట్టి, ముఖ్య నాయకులు సుబ్రహ్మణ్యం గౌడు, చౌడప్ప,ఖాజాపీర్, గ్యాస్ నాగరాజు,తెలుగు యువత నాయకులు ధీరజ్, గిరిధర్ గోపాల్, మరియు మహిళా నాయకురాళ్లు శివకుమారి, వరలక్ష్మి, ప్రమీల, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు ముందస్తుగా పలమనేరు MLA అమరనాధ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డిను హౌస్ అరెస్టు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టులను నిరసిస్తూ రెండో రోజు శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు నిరసన ధర్నా నిర్వహించారు. దేశంలో జి20 సదస్సు జరుగుతున్న తరుణంలో ప్రపంచ విజన్ ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయడం దేశానికే తలవొంపులు అని ఎస్ సి వి నాయుడు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో ఎస్ సి వి నాయుడు నాయకులు కార్యకర్తలతో కలిసి తన స్వగృహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్ర వాడ ప్రవీణ్ కుమార్, ఎస్సీవీ దిలీప్, భాస్కర్ నాయుడు,, నారాయణ యాదవ్, ఎస్సీబీ కిరణ్, పూల ఆనంద్, రాఘవరెడ్డి, సర్పంచ్ బాలాజీ, మాజీ సర్పంచ్ హరి నాయుడు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు మోహన్ నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు కు బైరెడ్డిపల్లి మండల తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలంలా ఎగసిపడ్డారు. రాజకీయ కక్షతో, చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత చేష్టలకు త్వరలో కళ్లెం వేస్తామని బైరెడ్డిపల్లి మండల టీడీపీ అధ్యక్షులు కిషోర్ గౌడు అన్నారు. చంద్రబాబు పై అసత్య నిందనలు వేసి అరెస్టు చేయడం బాధాకరమని బాధపడ్డారు. పలమనేరు నియోజకవర్గo లో పని చేస్తున్న అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు సవాల్ గా సంభాషించారు. ఇక నాలుగు నెలలు మాత్రమే ఉన్నది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ....మీ అంతు చూసేది కూడ టీడీపీ ప్రభుత్వమే గుర్తు పెట్టుకోండని హెచ్చరించారు.
చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అక్రమా ఆగస్టు కు నిరసనగా. చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో Ex MLC దొరబాబుమ సురేంద్ర కుమార్, చంద్ర ప్రకాష్, కటారి హేమలత, కాజుర్ బాలాజి, మోహన్ రాజ్, శశికర్ బాబు., వెంకటేష్ యాదవ్, CMT త్యాగ, జాఫర్, రాజేష్కే, కేశవనాయుడు, రాజశేఖర్, సీఎం విజయా, దుర్గా చౌదరి తదితరులు పాల్గోన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా గంగాధర నెల్లూరులో జరిగిన నిరసన దీక్షలో నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్, పార్టీ నాయకులు చిట్టిబాబు, అన్నమలై, సందాని, జ్యోతిశ్వర్ రెడ్డి, పెద్దయ్య శెట్టి, రంగరాజు, బాలాజీ, హేమంత్ రెడ్డి, రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.