23, సెప్టెంబర్ 2023, శనివారం

చంద్రబాబుకు మద్దతుగా ఉద్యమిస్తున్న నారీమణులు

చంద్రగిరిలో భారీ ప్రదర్శన 

పూతలపట్టులో నిరాహార దీక్షలు 

సెట్టేరిలో కొవ్వేత్తుల ప్రదర్శన 

చిత్తూరు ఓంశక్తి మాలతో దీక్షలు  

 



తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మహిళలు మేము సైతం  అంటూ ఆందోళన  కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మేము ఉన్నామంటూ  ధ్యైర్యం ఇస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు మహిళలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా కదిలి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు చంద్రబాబు నాయుడుకు మద్దతు ప్రకటిస్తున్నారు. బాబుకు మద్దతుగా ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తున్నారు.


 దేశం పార్టీ పాలనలో మహిళలకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే మహిళలకు ఆస్తిలో హక్కు సంక్రమించింది. అలాగే తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అయ్యాయి. పావలా వడ్డీ కింద రుణాలు అందజేయడం ప్రారంభమైంది. అలాగే దీపం పథకం కింద వంటగ్యాసులను పంపిణీ చేశారు. మహిళలకు పసుపు-కుంకుమ కింద నిధులను అందజేశారు. ఒక ఆడపడుచుగా మహిళలను చంద్రబాబు ఆదుకున్న తీరుకు మద్దతుగా మహిళా లోకం చంద్రబాబుకు బాసటగా నిలుస్తోంది.


అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మహిళలకు నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కలుగజేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలకు ఆకర్షితులైన మహిళలు చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. పట్టణాల్లో ఐటీ చేస్తున్న ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రోడ్లమీదకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కారణంగానే రాష్ట్రంలో  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిందని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి పొందుతున్నారని వివరిస్తున్నారు. హైదరాబాదులో హైటెక్ సిటీ నుండి నిర్మించి, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన చంద్రబాబుకు  జైలు శిక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కారణంగానే గ్రామాలు సైతం అభివృద్ధి చెందాయని, ఐటీ చేసిన విద్యార్థులు లక్షలాది రూపాయల జీతాలున్న పొందుతున్నారని వివరిస్తున్నారు. చంద్రబాబు కారణంగానే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో  తెలుగు విద్యార్థులు భారీగా కొలువుల సంపాదించారంటూ మద్దతుగా నిలుస్తున్నారు. 


మహిళలు చంద్రగిరిలో బాబుతో మేము సైతం అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. తొండవాడ నుంచి ప్రారంభమైన ర్యాలీ నాలుగు కిలోమీటర్ల పైగా సాగింది. ఈ ర్యాలీకి చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి నాయకత్యం వహించారు. పూతలపట్టులో ఇంచార్జ్  మురళీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బంగారుపాలెం మండలం సెట్టేరిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు పట్టణ అధ్యక్షురాలు కటారి హేమలత ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారి వేషధారణలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *