7, సెప్టెంబర్ 2023, గురువారం

పార్టీ టిక్కెట్టు కావాలా బాబూ !? Conditions Apply

కనుమరుగు అవుతున్న ప్రజా సేవకులు 
ధన, కుల, కండ బలానికే ప్రాధాన్యత 
ఒక పార్టీలో  మేధావులకు అవకాశం
మరొక పార్టీలో అమ్మకానికి టిక్కెట్లు రెడీ
ఇంకొక పార్టీలో నమ్ముకున్న వారికి అందలం

గతంలో ఎన్నికలలో పోటీ చేయాలన్నా, పార్టీ టికెట్ కావాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఉండేవి. స్వాతంత్ర సమరయోధులు, మేధావులు, ప్రజాసేవలో నిష్ణాతులైన వారికి పార్టీ టికెట్లు లభించేవి. ధన  ప్రభావం అంతగా ఉండేది కాదు. ఎన్నికల ప్రచారానికి మాత్రం ధనాన్ని వ్యయం చేసే వాళ్ళు. ఓటర్లకి డబ్బులు పంచడం ఉండేది కాదు. తాము చేసినా సేవ కార్యక్రమాలను చెపుతూ, భవిష్యత్తులో ఎం చేయగలరో చెప్పేవాళ్ళు. ఇప్పుడు టికెట్ల వ్యవహారం పూర్తిగా మారిపోయింది. ధన బలం ఉన్నవారికి పార్టీ టికెట్లను కేటాయిస్తున్నారు. పోలింగ్ బూతులను  ఆక్రమించడం, రిగ్గింగులు  చేయడం తదితర కార్యక్రమాలలో నిష్ణాతులకు ప్రాధాన్యత ఉంటుంది. అవతల పార్టీ వాళ్ళు నామినేషన్ వేయకుండా చూడాలి. వేస్తే భయపెట్టి ఉపసంహరించుకొనే విధంగా చూడాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు ఓటింగ్ కు రాకుండా చూడాలి. లేకుంటే, వారి ఓట్లను మనమే ముందుగా వేసుకోవాలి. వాళ్ళ ఏజెంట్లను రాకుండా చూడాలి. వచ్చినా వారిని మేనేజ్ చేసి, తమకు అనుకూలంగా తిప్పుకోవాలి. ఎన్నికలలో ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేయగలరు అనే విషయం మీదనే టిక్కెట్టు ఆధారపడి ఉంటుంది. ఆ డబ్బు అక్రమ మార్గంలో సంపాదించారా, లేక సక్రమ మార్గంలో సంపాదించారా అన్నది అవసరం లేదు. 50 కోట్ల పైన బ్యాంకు బ్యాలెన్స్ చూపిస్తే టిక్కెట్టు ఖరారు  అవుతుంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఎర్ర చందనం అక్రమ రవాణా చేసేవాళ్లు రాజకీయరంగంలో రాణిస్తున్నారు. ప్రజలకు ముక్కు మొఖం తెలియని వారిని, పరిచయం కూడా లేని వారిని పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించి, వారిని అనేక అక్రమ మార్గాలలో గెలిపించుకుంటున్నారు. వాళ్లు గెలిచిన తర్వాత ప్రజల సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చి, ఎన్నికలలో ఖర్చుపెట్టిన డబ్బుకు రెండింతలు మూడింతలు సంపాదించి, మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఒక పార్టీలో ఒక కులం, విధేయతకు పెద్దపీట వేస్తున్నారు. మరో పార్టీలో విధేయతను పక్కన పెడుతున్నారు. పార్టీ కోసం ఎంతగా శ్రమించినా, ఎంత త్యాగం చేసిన పరిగణలోకి తీసుకోవడం లేదు. బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి. తమ కులం వాళ్లు సిఫార్సు చేయాలి. అప్పుడే పార్టీ టిక్కెట్లు ఖరారు అవుతుంది. జనసేన పార్టీలో  మాత్రం వీటికి భిన్నంగా అభ్యర్థుల గుణగణాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రజల్లో వాళ్లకి ఉన్న పలుకుబడిని, సేవా తత్పరతను చూస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వాళ్ళను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. పూర్తిగా పాడైపోయిన రాజకీయాలలో జనసేన ఒక ఆశా కిరణం లాగా కనిపిస్తోంది.



ఇంకో ఆరు నెలల్లో ఎపి ఎన్నికలు రానున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చినారావచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలలో టికెట్ల వేట ప్రారంభం అయ్యింది. ఒక్కో పార్టీ టికెట్టు కావాలంటే ఒక్కో ఆర్హత అవసరం అన్న చర్చ కొనసాగుతున్నది. ఇటీవల తిరుపతికి చెందిన బలిజ సామాజిక నేత ఒకరు టిక్కెట్టు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. అతి కష్టం మీద సమయం తీసుకుని పవన్ ను కలసి తన మనసులో మాట చెప్పారు. తాను గతంలో ప్రజారాజ్యంలో పనిచేశానని తెలిపారు. ఇప్పుడు టిడిపిలో ఉన్నప్పటికీ చురుగ్గా పనిచేయ లేదని చెప్పారు. జనసేన టిక్కెట్టు ఇస్తే ఎంతైనా ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. అవసరం అయితే పార్టీకి ఐదారు కోట్లు ఫండ్ కూడా ఇస్తానన్నారు. అన్నీ విన్న పవన్ మీలాంటి వారికి టిక్కెట్టు ఇవ్వనని తేల్చి చెప్పారు. మేధావులు, సామాజిక స్పృహ ఉన్న టిక్కెట్టు ఇస్తానన్నారు. వారికి కులం, డబ్బు చూసి టిక్కెట్టు ఇచ్చే సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు.


టిడిపిలో టిక్కెట్టు కావాలంటే కోట్లు చూపవలసి ఉందని అంటున్నారు. పార్టీకి సేసిన సేవలు లాంటివి ఏవీ చంద్రబాబు చూడటం లేదంటున్నారు. కోట్లు కొట్టు టిక్కెట్టు పట్టు అన్నట్టు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. సత్యవేడు ఇంఛార్జిగా ఉన్న జేడీ రాజశేఖర ను తొలగించి హెలెన్ ను ఇంచార్జి గా నియమించడంతో కోట్లు చేతులు మారాయని అంటున్నారు. జి డి నెల్లూరు ఇంచార్జిగా పార్టీతో సంబంధం లేని డాక్టర్ థామస్ ను నియమించడంతో డబ్బు కీలక పాత్ర పోషించిందని చర్చ నడుస్తున్నది. పూతలపట్టు ఇంచార్జి విషయంలో కూడా డబ్బు పనిచేసిందని అంటున్నారు. తన సామాజిక వర్గం నేతలు కొందరు హామీ ఇవ్వడంతో తిరుపతిలో జర్నలిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ మురళీ మోహన్ ను ఇంఛార్జిగా నియమించారు. ప్రతి నియోజక వర్గంలో చంద్రబాబు డబ్బు ఉన్న వారికే టిక్కెట్టు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.


జగన్ తీరు టిడిపికి భిన్నంగా ఉంది. ఆయన తనను నమ్ముకున్న వారికి టిక్కెట్లు ఇస్తున్నారు. పాదయాత్రలో తనకు ఫిజియో థెరపీ చేసిన గురుమూర్తిని తిరుపతి లోక్ సభ సభ్యునిగా చేశారు. కుప్పం ఇంచార్జి భరత్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. అలాగే పార్టీకి అవసరం అని గుర్తించి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తనను నమ్ముకున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని తుడా చైర్మన్ చేశారు. అయనకు చంద్రగిరి టిక్కెట్టు హామీ ఇచ్చారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి టిటిడి ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి తిరుపతి టిక్కెట్టు హామీ ఇచ్చారని అంటున్నారు. అలాగే ప్రతి నియోజక వర్గంలో విశ్వాసం కలవారిని పోటీలో పెట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.


 ఈ నేపథ్యంలో మూడు పార్టీల వ్యవహారంపై ప్రజల్లో ఆసక్తికరమైన  చర్చలు జరుగుతున్నాయి. " పవన్ ప్రజా సేవకులు, మేధావులకు టిక్కెట్లు ఇస్తారు. చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారు. జగన్ నమ్ము కున్న వారికి టిక్కెట్లు ఇస్తారు" అన్న  వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT  US ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *