10, సెప్టెంబర్ 2023, ఆదివారం

బాబు అరెస్టుకు నిరసనగా నేడే బంద్


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు  నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇచ్చింది.  ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు  రిమాండ్ కు తీస్కెళ్లిన సందర్బంగా రేపు ప్రతి మండల కేంద్రంలో బంద్ చెయ్యాలని రాష్ట్ర పార్టీ నుండి ఆదేశాలు వచ్చాయి. అన్నీ షాప్ లు స్కూల్ లు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనేలా చూడాలని కోరారు. ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ లు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రైవేట్ ప్లేస్ లలో వుండి బంద్ టైం కి మండల కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని కోరారు.


 బంద్ కారణంగా తెదేపా నాయకులు, కార్యకర్తలను పోలీసు కేసుల్లో ఇరికించే  భారీ కుట్ర జరుగుతోందనీ, జాగ్రత్తగా ఉండాలి పార్టీ నాయకులు కోరారు. చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే పనులు చేయవద్దని స్పష్టం చేశారు. న్యాయస్థానాలను, న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు పెట్టవద్దని వారించారు.  పోలీసులు సైబర్ నిఘా ఉంచారనీ జాగర్తగా ఉండాలని తెలిపారు. నియోజక వర్గాల్లో స్థానిక నాయకులపై బైండోవర్ కేసులు పెట్టే  కుట్ర జరుగుతోందన్నారు. నాయకులపై బైండోవర్ కేసులు పెడితే రేపు మన పార్టీ తరఫున ఏజెంట్లు కరువౌతారని అప్రమత్తం చేశారు. ఇప్పుడు కనుక గొడవలు చేస్తే కేసులు పెట్టి ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఇది చాలా కీలక సమయం. ఆవేశపడితే భారీ నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. సహనంతో ఉండాలని, రెండ్రోజుల్లో బాబుకు  బెయిల్ వస్తుందన్నారు. ఆవేశపడితే వ్యక్తి గతంగా, పార్టీ పరంగా నష్టపోతామని తెదేపా క్యాడర్ కు దిశా నిర్ధేశం చేశారు.


రాష్ట్రాభివృద్ధికి పాటుపడిన తమ నాయకుడి మీద కుట్ర పన్ని అక్రమ కేసుల్లో ఇరికించారని పార్టీ శ్రేణులు ఆందోళన పడుతున్నారు. శని, ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేశారు. శాంతియుతంగా ఆందోళనలుచేసినా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తాజాగా, సోమవారం శాంతియుతంగా బంద్‌ నిర్వహించేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. దుకాణదారులు, ప్రజలు, ఇతర వర్గాలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌తో పాటు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేవరకు నిరసన కార్యక్రమాలు చేస్తామంటున్నారు. మరోవైపు టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనలను అడ్డుకున్నట్లే బంద్‌నూ విఫలం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తారనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. 


ప్రతి మండలంలో 144 సెక్షన్

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే కీలక ఆదేశాలు అందాయి. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *