17, సెప్టెంబర్ 2023, ఆదివారం

టిడిపి జనసేన పొత్తుతో జగన్ చిత్తు!?

రానున్న ఎన్నికల్లో విజయం తధ్యమన్న ధీమా
100కు పైగా స్థానాలు వస్తాయని అంచనా 
బాబు కోసం వినాయకుణ్ణి మొక్కుతున్న శ్రేణులు 






రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ఆలోచన తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపుతున్నాయి. తెలుగుదేశం కేడర్ ఫుల్ జోష్ మీద ఉంది. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించి  అధికారాన్ని కైవసం చేసుకుంటామన్న అన్న ధీమాతో ఉన్నారు. రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని వినాయక చవితి పండుగను ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న  ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం, జైలుకు పంపడంతో సానుభూతి, మద్దతు దేశవ్యాప్తంగా ఎల్లువెత్తుతోంది. ప్రజలు గ్రామ గ్రామాన ఆందోళన చేస్తున్నారు. ఇందుకు తోడు జనసేన పార్టీ కలవడంతో మరింత బలం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బిజెపి కూడా కలిస్తే సునాయాసంగా పార్టీ అధికారంలోకి వస్తుందని, కేంద్రం అండదండలతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని భావిస్తున్నారు. పార్టీ నేతలు గట్టి విశ్వాసంతో ఈ వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. తమ అధినేత చంద్రబాబు తొందరగా విడుదల కావాలని వినాయకుణ్ణి మొక్కుతున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం శ్రేణులు మంచి హుషారు మీద ఉన్నారు. వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. వినాయక చవితి పందిళ్లలో ప్రజలతో మమేకమవుతూ చంద్రబాబు అక్రమ అరెస్టులు గురించి వివరిస్తున్నారు. వినాయక చవితి పందిళ్ళే వేదికగా జగన్ వ్యతిరేక ప్రచారం జిల్లాలో ఊపందుకుంది.


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టు కుంటామని  ప్రకటించడంతో వైసిపి నేతల గుండెల్లో  రైళ్లు పరిగెడుతున్నాయి. చాలా మందిలో ఓటమి భయం ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా వెయ్యి ఓట్ల లోపు ఆధిక్యత  సాధించి గెలిచిన ఎమ్మెల్యేలలో ఈ ఆందోళన మరీ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 42 నియోజక వర్గాలలో  వైసిపి ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్థులపై వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో వైసిపి 151 నియోజకవర్గాల్లో గెలుపొందగా అందులో 42 చోట్ల వెయ్యి ఓట్ల మెజారిటీతో వచ్చింది. ఉదాహరణకు విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ 25 ఓట్ల తేడాతో గెలుపొందింది. తిరుపతిలో వైసిపి ఎమ్మెల్యే కేవలం 708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పలు స్థానాలలో వైసిపి ఇదే వెయ్యి లోపు మెజారిటీ సాధించింది. వీరిలో అత్యధికులు 500 ఓట్ల లోపు తేడాతో విజయం సాధించారు. కొందరు 500-1000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2019లో వైసిపి, జనసేన, టిడిపి మధ్య ముక్కోణపు పోరు జరిగింది. టిడిపి, జనసేన మధ్య ఓట్లు చీలిపోవడంతో వైసిపి లాభపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు టిడిపి, జనసేన పొత్తు నిర్ధారణ కావడంతో ఓట్లు చీలికపోవచ్చని అంటున్నారు. దీని వల్ల వైసిపికి  నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో  ప్రత్యర్థి పార్టీల పొత్తును వైసీపీ వ్యతిరేకిస్తోంది. 2024 ఎన్నికలో రాష్ట్రంలో టిడిపి, జనసేన కలసి అధికారంలోకి వస్తుందన్న వాదన బలపడు తున్నది. సుమారు 100కు పైగా అసెంబ్లీ స్థానాలను తెదేపా, జనసేన కూటమి గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు.


చిత్తూరులో పూర్వ వైభవం: ఇదిలా ఉండగా చంద్రబాబు స్వంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ టిడిపి పూర్వ వైభవం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1983,1994 ఎన్నికల్లో ఉన్న 15 స్థానాల్లో 14 స్థానాలలో టిడిపి విజయం సాధించింది. 2019ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో చంద్రబాబు తప్ప మిగిలిన 13 చోట్ల వైసిపి అభ్యర్ధులు గెలిచారు. ఈ సారి చంద్రబాబును కూడా కుప్పంలో ఓడిస్తామని వైకాపా నేతలు సవాలు విసురుతున్నారు. అయితే చంద్రబాబు అక్రమ కేసులో అరెస్టు కావడం, పొత్తు ఉంటుందని స్పష్టం కావడంతో జిల్లా టిడిపి కార్యకర్తల్లో జోస్ కనిపిస్తోంది. ఈ సారి కనీసం పది స్థానాలలో విజయం సాధిస్తామని అంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో జనసేన తిరుపతి, మదనపల్లి స్థానాల కోసం పట్టు పట్టే అవకాశం ఉందంటున్నారు. జి డి నెల్లూరు, శ్రీకాళహస్తి కూడా ఆశిస్తున్నారు. కాగా బిజెపి కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాంటి పరిస్థితులలో బిజెపి కూడా ఒకటి రెండు స్థానాలు అడిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండు పార్టీలకు కలసి రెండు స్థానాల కంటే ఎక్కువ ఇవ్వక పోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.


పార్లమెంటులో MPల ధర్నా: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం పార్లమెంటులోని ఈ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో మాజీ ఎంపీలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును టిడిపి ఎంపీలు ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు.  జయదేవ్ గల్లా, కేశినేని నాని మాట్లాడుతూ.. అక్రమ అరెస్టును ఖండించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికే నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 45 ఏళ్ల జీవితంలో ఎలాంటి అవినీతి మరకలేని చంద్రబాబును కక్షపూరితంగా వేధిస్తున్నారని ఆరోపించారు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *