తెలుగుదేశం పార్టీ అధినేత బాబు నాయుడు అరెస్టు నేపధ్యంలో నందమూరి బాలకృష్ణ రాజకీయంగా మరింత క్రియాశీలకం కానున్నారు. ఇప్పటివరకు హిందూపురానికే పరిమితమైన నందమూరి బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను ప్రజలలో ఎండగట్టనున్నారు. ప్రభుత్య అవినీతి, కుంభకోణలు, ప్రజా వ్యతిరేక విధానాలను వివరించనున్నారు. అన్ని జిల్లాలను తిరుగుతూ పార్టీని పటిష్టం చేయడంతో పాటు తెదేపా నాయకులు కార్యకర్తలకు మనో దైర్యం నింపనున్నారు. చంద్ర బాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు అదైర్య పడాల్చిన అవసరం లేదని, తాను వస్తున్నానని మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నందమూరి బాలకృష్ణ బారోసా ఇచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడానికి మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాస్త్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది కార్యక్రమాలు. చంద్రబాబు పర్యటనలు ఉదృతంగా జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంతో పార్టీ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. .యువగళం పాదయాత్రకు కూడా తాత్కాలిక విరామం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలు తిరుగుతూ కార్యకర్తలను., ప్రజలను చైతన్యవంతులు చేశారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అవినీతి అక్రమాలను ఎండగట్టారు.
చంద్రబాబు నాయుడు .పర్యటనలకు విశేష స్పందన లభిస్తుంది. ఒకవైపు యువగళం పాదయాత్ర, మరోవైపు చంద్రబాబు నాయుడు పర్యటనలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికలను ప్రకటించారా అన్న స్థాయిలో టిడిపి ప్రచార కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఊహించిన విధంగా చంద్రబాబు అరెస్టుతో ప్రచార కార్యక్రమాలకు బ్రేక్ పడింది. దీంతో ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి నందమూరి తారక రామారావు తనయుడు, ఆయన సినీ రంగ వారసుడు నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చినట్లు సమాచారం. నందమూరి కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళితే విశేష స్పందన ఉంటుందని పార్టీ నాయకులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఎందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారని తెలిసింది. దీంతో మంగళవారం నందమూరి బాలకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుధీర్ఘంగా మాట్లాడరు. కార్యకర్తలు, నాయకులు ఎవరు భయపడాల్చిన అవసరం లేదని, తాను వస్తున్నారని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో నందమూరి బాలకృష్ణ పార్టీ బాధ్యతలను తీసుకొని, రాష్ట్రం మొత్తం మీద పర్యటించనున్నారని తెలిసింది. బాలకృష్ణతో పట్టు అవసరం అయితే, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా పర్యటనలు చేయడానికి సమాలోచనలు సాగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో పార్టీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవడానికి పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. చంద్ర బాబు లాంటి చరిస్మా ఉన్న నాయకుడు మరొకరు లేరు. దీంతో బాలకృష్ణను దగ్గరుండి చూసుకోవాలని చంద్రబాబు సూచించారని సమాచారం. ఇటువంటి తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు బామర్ది బాలకృష్ణ పార్టీని ముందుకు నడిపించడానికి సిద్దం అవుతున్నారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన బాలకృష్ణ దీనిపై స్పష్టతను ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే నేనొస్తున్నా.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరినీ కలుస్తా, ఎవరూ భయపడాల్సిన పనిలేదని బాలకృష్ణ పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చారు.
తండ్రి చంద్రబాబు జైల్లో ఉండటంతో నారా లోకేష్ పార్టీ భాధ్యతలు వహిస్తారని అందరు భావించారు. ఈ సమయంలో పార్టీ బాధ్యతలు తీసుకోవడం సరైంది కాదని నారా లోకేష్ భావించడంతోనే... ఆ స్థానాన్ని బాలకృష్ణకు ఇస్తున్నారని తెలుస్తుంది. దీంతో టీడీపీ పగ్గాలు బాలకృష్ణ చేపట్టడం లాంఛనమే అయింది. 27 ఏళ్ల తరువాత టీడీపీకి నందమూరి వంశం తిరిగి నాయకత్వం వహిస్తుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు పార్టీని కైవసం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మళ్ళీ పార్టీకి ఆయన కుమారుడే దిక్కు అయ్యారు. బాలకృష్ణ పర్యటనల షెడ్యూల్ ను తొందరలోనే పార్టీ త్వరలోనే ఖారారు చేయనుంది.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT US ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.