విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం, సిపిఐ ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి విద్యుత్తు చార్జీలు విపరీతం పెంచి ప్రజలపై పెను భారం మోపడాన్ని నిరసిస్తూ బుధవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి యస్.నాగరాజు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా విద్యుత్ చార్జీలను పెంచనని హామీ ఇచ్చి ఇప్పుటికి 5సార్లు పెంచారని పేర్కొన్నారు,, పేదలకు 200యూనిట్లు వరకు ఉచితమని చేసిన ప్రకటన సైతం బూటకమని అన్నారు. రైతాంగానికి స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ వినియోగం ఆడిట్ పేరున ఉచిత విద్యుత్ కు మంగళం పాడబోతున్నారని విమర్శించారు.
.సిపియం జిల్లా కార్యదర్శ వాడ గంగరాజు మాట్లాడుతూ గతంలో విద్యుత్ చార్జీలను పెంచిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా కూల్చి వేశారో జగన్ గుర్తుంచు కోవాలని అన్నారు.నాడు బషీర్ బాగ్ అమరుల త్యాగం మరువ లేమని వారి స్పూర్తితో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమానికి సన్నద్ధం కావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం పై నా విద్యుత్ చార్జీల భారం విపరీతం గా పెరిగిపోయిందని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమం కన్నా మూడు రెట్లు అధికంగా ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. రాబోవు ఎన్నికల లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా వుండాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు జనార్ధన్, సిపిఎం జిల్లా నాయకులు కే.సురేంద్రన్ లు ,ప్రసంగించారు.ఈ నిరసన కార్యక్రమం లో సిపిఐ నాయకులు మణి, విజయ గౌరి, జయలక్ష్మి, రఘ,జయకుమారి, రమాదేవి,జమిలాబి,కుమారి, కోమల, లత,సిపిఎం నేతలు చైతన్య, ఓబుల్ రాజు, గిరిధర గుప్తా,భువనేశ్వరి, మురళి, జ్యోతి ఈశ్వరయ్య, జయంతి తదితరులు పాల్గొన్నారు.