28, సెప్టెంబర్ 2023, గురువారం

GPS పేరుతో ఉద్యోగులను దగా చేసిన జగన్

తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్



జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర చేస్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన వారం రోజులకంతా సిపిస్  ను రద్దుచేసి ( ఓపిఎస్) పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతానని చెప్పి దాదాపు రాష్ట్రంలో ఉన్న లక్షలాదిమంది ఉద్యోగస్తులను మోసం చేశారని తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. గురువారం చిత్తూరు తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగస్తుల కుటుంబాల ఓట్లని కొల్లగొట్టి, తీరా అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు జిపిఎస్ అనే కొత్త పథకం పేరుతో ఉద్యోగస్తులకు కుచ్చుటోపి పెట్టడానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం అనేది ఉద్యోగస్తుల దగా చేయడమే అవుతుందన్నారు.


 కనీసం ఉద్యోగ సంఘాలతో జిపిఎస్ గురించి చర్చించకుండా ఉద్యోగస్తులు జీవితాలతో జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని అన్నారు. ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బుతోనే వారికి పెన్షన్ ఇచ్చి ఆ  పథకంకు జీ. పి.ఎస్ అనే పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రజెందరెడ్డి మాట్లాడుతూ ఓ పి ఎస్ అమలు చేస్తే అప్పు పుట్టదని పుట్టదని చెప్పడం ఆర్థిక మంత్రి మూర్ఖత్వానికి నిదర్శనం.  కేవలం ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తును తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకోవడానికి జిపిఎస్ పథకాన్ని తీసుకురావడం దురదృష్టం. ఆర్థిక మంత్రికి ఆర్థిక వ్యవహారాల పైన కనీసం అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఉద్యోగ సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తే వాళ్లపైన బైండోవర్ కేసులు పెట్టడం, వాళ్ళ  ఇంటి దగ్గరకు వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించడం దురదృష్టకరం. రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన జరుగుతుంది. 


కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని పెర్మనెంట్ చేసినారని  కొన్ని ప్రధానమైన ఉద్యోగ సంఘాలు, ముఖ్యమంత్రికి భజన చేసే బ్యాచి, పాలాభిషేకాలు అభిషేకాలు  చేస్తున్నారు.  లక్షలాదిమంది ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్న ఓ పి ఎస్ ని అమలు చేయకుండా ఉంటే, ఈ ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యోగస్తులు జీవితాలతో చెలగాటమాడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తవణంపల్లి మండల పార్టీ కార్యదర్శి మధు యాదవ్, జిల్లా క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు గిరిబాబు, మండల్ బీసీ సెల్ అధ్యక్షుడు వినాయక, మైనార్టీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి షబ్బీర్ భాష, నియోజకవర్గ బీసీ సెల్ అధికార ప్రతినిధి ధరణి ప్రకాష్  పాల్గొన్నారు. 



తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా బాబుతో నేను సైతం అంటూ నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం దీక్షలో నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. జగన్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెట్టాడంటూ వినూత్న రీతిలో తెలుగుదేశం శ్రేణులు  నిరసన తెలియచేశారు.

 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *