19, సెప్టెంబర్ 2023, మంగళవారం

చంద్రబాబు మీద మరో కేసు

డిల్లీ నుండి లోకేష్ రాగానే అరెస్టుకు రంగం సిద్దం 

ఫైబర్ నెట్ స్కాం కేసులో A1 గా చంద్రబాబు

ఎంపీ సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు



 ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు మీద సిఐడి మరో కేసును నమోదు చేసింది. ఒకటి రెండు రోజుల్లో నారా లోకేష్ ను కూడా CID పోలీసులు అరెస్టు చేయనున్నారు. గతంలో ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం CID విచారణకు అదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఏసీబీ కోర్ట్ లో పిటిషన్ వేయగా, ఈ కేసును విచారించడానికి ఏసీబీ కోర్ట్ అంగీకరించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుని ప్రధాన ముద్దాయిగా పేర్కొనడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించి కోర్ట్ లో చంద్రబాబు తరపున లాయర్ విధించాల్సి ఉంటుంది.

ఏమిటి  ఫైబర్ నెట్ కుంభకోణం ?

 లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో  అక్రమాలకు తెరలేవపారని, సుమారు రూ.2 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు తేల్చేశారు. ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు చెందిన టెరా సాఫ్ట్ వేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు టెంబర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు అతిక్రమించారని చెప్పారు. హరిప్రసాద్ తో పాటు ఇన్ ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీగా పనిచేసిన సాంబశివరావు విచారించి, అదే రోజు సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెరా సాఫ్ట్ కోసం కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించేందుకు వక్రమార్గాన్ని ఎంచుకున్నట్లు CID పేర్కొంది. నిపుణుల ఆభ్యంతరాలను బేఖాతరు చేసి రూ.330 కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్లు కట్టబెట్టారని విచారణలో తేల్చింది. 


అవినీతికి పాల్పడిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ టీడీపీ ప్రభుత్వంలో ఇ గవర్నెన్స్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగారు. సాంబశివరావు నాటి ఇన్ ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ-ఎంపీ సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. రూ.2 వేల కోట్ల విలువైన పనులకు మొదట రూ.330 కోట్లకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ 2015లో ఇన్ క్యాప్ ద్వారా టెండర్లు పిలిచినా టెండర్ల దాఖలుకు 2015 జులై 31 గడువు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఒక రోజు ముందు జులై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరా సాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణమని CID అధికారులు తెలిపారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ కు టెరా సాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు నాసిరకంగా ఉన్నాయని, టెండర్ నిబంధనలు పాటించకపోయినప్పటికి నిబంధనలు విరుద్దంగా బిల్లులు చెల్లించారు. రూ.119.98 కోట్ల మేర నష్టం జరిగినట్లు సీఐడీ విచారణలో తేలింది. ఇందులో లోకేష్ టీం బాధ్యులుగా గుర్తించారు. డిల్లీ నుండి రాగానే ఇదే కేసులో నారా లోకేష్ ను కూడా CID పోలీసులు అరెస్టు చేయనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *