30, సెప్టెంబర్ 2023, శనివారం

లైంగిక వేధింపుల సమస్యపై కలెక్టర్ సీరియస్

కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ హామీ

లైంగిక వేధింపుల సమస్యపై ప్రత్యేక సమావేశం

కలెక్టర్ వెంకటరమణారెడ్డి సిఐటియు వినతి  


పని ప్రదేశాలలో శ్రామిక మహిళలతో లైంగికంగా వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, 2013 చట్టాన్ని పటిష్టంగా అమలు జరుపుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో శ్రామిక మహిళా నేతల ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్  కలిసిన వినతి పత్రం అందచేశారు. తిరుపతి జిల్లాలో స్థానిక కమిటీ పనిలో లేదని, అసలు కమిటీ ఉన్నట్టుగా జిల్లా ప్రజానీకానికి తెలియదని సమస్యలను ఎవరికి వివరించాలో అర్థం కాని పరిస్థితిలో మహిళలు ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 


జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక కమిటీ, ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తుంటే తిరిగి వారే ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని పలు ఘటనలను ఉదహరించారు. ఇలాంటి సందర్భాల్లో కమిటీల జోక్యం అవసరమని, స్వతంత్రంగా వ్యవహరించగలిగే వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని సిఐటియు తరపున నేతలు తెలిపారు. 


అక్టోబర్ మొదటి వారంలో లైంగిక వేధింపుల సమస్యపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సమస్యలున్న మహిళలు, వారి తరపు సంఘాల వారు ఫిర్యాదులు అందించవచ్చని,  తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. లైంగిక వేధింపుల సమస్య పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని 2013 చట్టాన్ని పటిష్టంగా, పారదర్శకంగా అమలుపరుస్తామని నేతలకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  శ్రామిక మహిళా నేతలు ఎస్ వాణిశ్రీ, బుజ్జి, పి. హేమలత, జయంతి, సాయిలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో పలువురు మహిళలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *