20, సెప్టెంబర్ 2023, బుధవారం

లోకేష్ అరెస్టుకు రంగం సిద్దం ?





టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో  అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టిన జగన్ సర్కార్  ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయబోతున్నారని YCP సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. లోకేష్ ప్రస్తుతం డిల్లీలో ఉన్నారు. లోకేష్ రాష్ట్రంలో అడుగు పెట్టగానే అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ప్రభుత్వం తీరును జాతీయ స్థాయిలో ఎండగట్టాలని భావించిన అధిష్టానం లోకేష్‌ను ఢిల్లీకి పంపింది. నాలుగైదు రోజులుగా లోకేష్ వరుస  ఇంటర్వ్యూలు, పార్లమెంట్‌లో ఎంపీలు ఏం మాట్లాడాలనే విషయమై  కార్యాచరణచేస్తున్నారు. లోకేష్ రాజమండ్రి రాగానే సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.


ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌ను అరెస్ట్ చేయనున్నారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. లోకేష్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలను సైతం ఉన్నతాధికారులు సిద్ధం చేశారని కూడా ప్రచారం ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేశ్‌ను అరెస్ట్ చేయరంటూ ప్రచారం కూడా నడుస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్ట్‌తోనే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏవిధంగా ఉంటాయని మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. సంచలనం సృష్టించిన ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం విదితమే. మంగళవారం ఇందులో చంద్రబాబు పేరును కూడా చేర్చారు. చంద్రబాబును విచారణ చేయాలని CID పోలీసులు PT వారెంట్ ను వేశారు. గతంలో  అరెస్టయిన వారికి న్యాయస్థానాల్లో చాలా మందికి బెయిల్ కూడా వచ్చింది. రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసు పెండింగ్‌లో ఉంది. 


 చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం కావాల్సిన అప్రతిష్ట మూటకట్టుకుంది. చంద్రబాబును అరెస్ట్ మరుక్షణం నుంచి ఇప్పటి వరకూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందోళనలు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున బాబుకు మద్దతు వస్తోంది. ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటీ పార్టీ కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయి. తెలుగు తమ్ముళ్లంతా ఈ కష్టకాలంలో ఐక్యంగా ముందుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతేనని C ఓటరు సర్వే తేల్చింది. ఒక్కసారిగా జగన్ సర్కార్ గ్రాఫ్ పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యుత్సాహంతో లోకేష్‌ను అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎలాగుంటాయోనని YCP నేతలు కొందరిలో గుబులు కూడా ఉంది.  తండ్రి అరెస్ట్ తో లోకేష్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారన్న వార్తలతో తెదేపా శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. 


అక్రమ కేసులో తన తండ్రిని అరెస్ట్ చేశారని హస్తిన వేదికగా జగన్ ప్రభుత్వ తీరును లోకేష్ ఎండగడుతున్నారు. ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఢిల్లీ నుంచి వరుస ట్వీట్లు చేయడం.. ఇక పార్లమెంట్ సమావేశాల్లో ఎలా ముందుకెళ్లాలి..? చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎవరెవరు ఏం మాట్లాడాలనే దానిపై లోకేష్ దిశానిర్దేశం చేస్తున్నారు. బాబు అరెస్టు విషయం పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది.  పార్టీ ఎంపీలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. వరుసగా భేటీలు, ఇంటర్వ్యూలతో బిజిబిజీగా ఉన్న లోకేష్ గురించే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదంతా డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్ర పన్నుతూ అసలు విషయాలను బయటికి రాకుండా, ఢిల్లీ నుంచి రాగానే లోకేష్ అరెస్ట్ అంటూ హడావిడి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. లోకేష్ విషయంలో ఎం జరుగుతుందో వేచి చూడాలి. తెదేపా శ్రేణులు, నాయకులు ఎం జరిగినా, ధీటుగా ఎదుర్కొనడానికి సిద్దం అవుతున్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు.



కాగా, చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో  9వ రోజు నిరాహార దీక్షలో  రైతులు, బీసీ నేతలు నియోజకవర్గ సంబంధించిన నాయకులు  పాల్గొన్నారు.  రాష్ట్ర కార్యదర్శిలు పాచిగుంట మనోహర్ నాయుడు, జనార్ధన్ రాజు,  భీమినేని చిట్టి బాబు నాయుడు,  ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు  హరిబాబు నాయుడు, ఎక్స్ ఎంపీపీ  స్వామి దాసు,  దేవ సుందరం,  రుద్రయ్య నాయుడు,  జై శంకర్ నాయుడు, లోకనాథ్ రెడ్డి,  సప్తగిరి ప్రసాద్,  తిరుమలనాథ్,  నాగేశ్వరరావు  అన్ని మండలాలకు సంబంధించిన రైతు నాయకులు పాల్గొన్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *