24, సెప్టెంబర్ 2023, ఆదివారం

జగన్ కసి తీరింది - వైసిపి కొంప కూలింది !


చంద్రబాబు అరెస్టుతో పెరిగిన తెదేపా గ్రాఫ్
జనసేన మద్దతుతో పెరిగిన తెదేపా ఓటర్లు
అధికారానికి చేరుగా తెదేపా, జనసేన కూటమి
జగన్ పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత
ఉద్యోగ, ఉపాధ్యాయులలో పెంక్షన్ రచ్చ



ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య  పరిణామాలు చోటు చేసుకున్నాయి.16 నెలలు జైల్లో ఉండి, 10 సంవత్సరాలు బెయిలు మీద ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ళు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగి 14 ఏళ్లు ముఖ్య మంత్రిగా ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోన రాజకీయ పండితులలో భవిష్యత్తు రాజకీయాలపై చర్చ మొదలయ్యింది. అయితే ముంజేతి కంకణానికి అద్ధమేల అన్నట్టు రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన రెండు ఎన్నికల ఫలితాలు, తాజా పరిస్థితులు విశ్లేషిస్తే చాలు. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కలసి పనిచేశాయి. జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలలో  టిడిపికి  102, వైసిపికి 67, బిజెపికి నారుగు వచ్చాయి. నవోదయ పార్టీకి రాగా స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. ఆ ఎన్నికల్లో టిడిపికి 47 శాతం వైసిపికి 45 శాతం ఓట్లు వచ్చాయి.

2019 ఎన్నికల్లో టిడిపి, విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో వైసిపికి 50 శాతం ఓట్లు,151 సీట్లు వచ్చాయి. టిడిపికి 40 శాతం ఓట్లు 23 సీట్లు వచ్చాయి. జనసేనకు  ఏడు శాతం ఓట్లు ఒక స్థానం వచ్చింది. బిజెపికి ఒక శాతం ఓట్లు, ఒక సీటు కూడా రాలేదు.  ఈ ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లను విశ్లేషించి, ఇప్పటి పరిస్థితులను పరిశీలిస్తే టిడిపి, జనసేన కలసి పోటీ చేస్తే అధికారం తప్పదని  అనిపిస్తోంది. రాష్ట్రంలో  అధికారంలోకి రావాలంటే ఉన్న 175 స్థానాలలో 88  స్థానాలు గెలవాలి గత ఎన్నికల్లో టిడిపికి 23, జనసేనకు ఒక స్థానం వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు చీకడం వల్ల 43 స్థానాలలో ఓడి పోవడం జరిగింది. దీని ప్రకారం రెండు పార్టీల పొత్తు వల్ల 67 స్థానాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. మరో 21 స్థానాలలో గెలిస్తే సులభంగా అధికారం లోకి వస్తారు.


రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కళ్యాణ్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. భాజపా కూడా కలిసి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టడం, జనసేన మద్దతు ప్రకటించడంతో తెదేపా గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు C ఓటరు సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది. స్వంత పార్టీలో తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. నెల్లూరు జిల్లాలో  ముగ్గురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గర అయ్యారు.  అమరావతి చుట్టూ పక్కల ఉన్న గుంటూరు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 15,  ప్రకాశం జిల్లాలో 11 స్థానాలు ఉన్నాయి. ఈ మొత్తం 43 ఎమ్మెల్యే స్థానాలలో ప్రజలు  రాజధాని విషయంలో వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నారు. రాజధానిని అమరావతి విశాఖకు తరలిస్తే ఆన్ని విధాలా నష్ట పోతామని భావిస్తున్నారు. ఇప్పటికే తమ ఆస్తుల విలువ పడి పోవటంతో కోపంగా ఉన్నారు. రాయలసీమలో ఉన్న 52 స్థానాలలో గత ఎన్నికల్లో వైసిపికి 49 స్థానాలు వచ్చాయి.


 రాజధాని తరలింపును ఇక్కడి మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోవడం పట్ల అసహనంతో ఉన్నారు. జగన్ ఎంత కుల తత్వం రెచ్చగొట్టినా రాయల సీమలో 25  స్థానాలు పైగా కోల్పోక తప్పదు. విశాఖ పట్నం ప్రజలు భూ కబ్జాలు, రౌడీయిజం, రుషి కొండకి గుండు కొట్టడం చూసి విసిగిపోయి వున్నారు. గోదావరి జిల్లాలలో 90 శాతం స్థానాలలో టిడిపి, జనసేన గెలుపు తథ్యం. ఉత్తరాంధ్రలో కూడా ఈ రెండు పార్టీలకు కలిపి 70 శాతం స్థానాలు వస్తాయి. ఉద్యోగులు, పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు వ్యాపారస్తులు, ఉద్యోగం కోసం ఎదురుచూసే యువత పూర్తిగా జగన్ పాలనను వ్యతిరేకిస్తున్నారు. 


ఈ విషయం మూడు ఎమ్మెల్సీ స్థానాలలో టిడిపి అభ్యర్థుల గెలుపుతో స్పష్టం అయ్యింది. కరెంట్ బిల్లులు నాలుగు రెట్లు పెరిగాయి. దీనితో అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఈ చిన్న లెక్కలు, అంచనాల ప్రకారం రెండు పార్టీలకు కలిపి కనీసం 120 నుంచి 130 స్థానాలు వస్తాయి అనడంలో సందేహం లేదు. ఎన్నికలు సమీపించే నాటికి  రెండు పార్టీలకు మరింత అనుకూల పవనాలు వీస్తే మరిన్ని స్థానాలలో గెలుపు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఓటమి తప్పదని జగన్ గుర్తించారు. ఆయన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే చేసి అదే  చెప్పారు. అందుకే ఓటమి తప్పదని భావించిన జగన్ చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించి, జైళ్లో పెట్టి పగ తీర్చుకుంటున్నారు. మిగిలిన కీలక నాయకులను కూడా అరెస్టులు చేయించే పనిలో ఉన్నారు. దీనివల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతుందని వైసిపి నాయకులు, కార్యకర్తలు కొందరు అంటున్నారు. జగన్ కసి తీర్చుకునే పార్టీ కొంప కూలుతుందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.


- డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి,
రాజకీయ విశ్లేషకుడు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *