కుప్పంలో భగ్గుమన్న YCP నేతల విభేదాలు
మునిసిపల్ ఆఫీసుకు తాళం తాళాలు వేసి నిరసన
తమ వార్డులో అభివృద్ధి జరగలేదని ఆవేదన
అధికార పార్టీలో బయడపడ్డ వర్గ విభేదాలు
కుప్పం నియోజకవర్గంలో YCP నేతలు అందరూ కలిసికట్టుగా తెదేపాను ఓడించాలని అధిష్టానం దిశా నిర్దేశం చేస్తుంటే, మునిసిపల్ కౌన్సిలర్లు తమలో తాము కొట్టుకుంటున్నారు. తమకు నిధులు కేటాయించలేదని అలుగుతున్నారు. వార్డులను అన్నిటిని సమంగా అభివృద్ధి చేయలేదని నిరసనలకు దిగుతున్నారు. తమ వార్డుకు నిధులు కేటాయించలేదని ఒక కౌన్సిలర్ సోమవారం మునిసిపల్ కార్యాలయానికి తాళాలు వేశారు. నాయకులూ రంగప్రవేశం చేసి, నచ్చచెప్పడంతో దిగివచ్చారు. పోలీసులు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది.
కేవలం అధికార పార్టీ అధికార దర్భంతో, ధనబలంతో మున్సిపాలిటీని గెలుచుకొని, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు శకం ముగిసిందని వైసిపి నాయకులు అంటున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడడంతో సొంత పార్టీ కి చెందిన (వైసిపి) నాయకులే కుప్పం మున్సిపాలిటీ కార్యాలయాన్ని తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే, 66 కోట్ల రూపాయలు కుప్పం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని స్వయంగా చిత్తూరు జిల్లా వైసిపి ఇంచార్జీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. కుప్పం వైసిపి నాయకులు మున్సిపాలిటీ పరిధిలో, వార్డులో ఉన్న సమస్యల జాబితాను మంత్రి వర్యులకు అందచేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఐతే మున్సిపాలిటీ కి సంబందించిన కౌన్సిలర్ల నేడు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేయడంతోనే అభివృద్ధి కుంటుడల తేటతెల్లమవుతుంది. పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామన్న వార్తను ప్రజలలోకి తీసుకెళ్లినా, క్షేత్ర స్థాయిలో కౌన్సిలర్ల వార్డు స్థాయిలో అభివృద్ధి పనులు నిర్వహించడానికి కావాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమయింది. ఈ కారణంగానే సొంత అధికార పక్షంలో నిరసన సెగలు పెల్లుబుక్కుతున్నాయు. ఈ నిరసనలు మునిసిపల్ కార్యాలనికి తాళాలు వేసే స్థాయికి వెళ్ళింది. దీనిని బట్టి కుప్పంలో జరుగుతున్న అభివృద్దిని అంచనా వేయవచ్చు. నిధులు విడుదల చేయకనే, కోట్లాది రూపాయలను విడుదల చేసినట్లు మంత్రులు గొప్పలు చెపుతున్నారని తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు. నిధుల లేమితోనే అధికారపార్టీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారని అంటున్నారు.
1996 లో కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆ నాటి నుండి కుప్పం నియోజకవర్గన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేశారు. కొత్త పధకం అమలు చేయాలి అంటే, పైలెట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేశారు. మల్లి ఆ సంక్షేమ పధకాన్ని అధికారుల ద్వారా సమీక్షించుకుని విజయవంతం అయిన తర్వాతనే రాష్ట్ర ప్రజలకు అమలు అయ్యేది. తన ఆలోచనలలో ఉన్న సంక్షేమ పథకాలను అలా ముందుగా కుప్పంలో అమలు చేసేవారు. దీనిని బట్టే చంద్రబాబు ఆలోచన విధానాన్ని బేరీజు వేసుకోవాలని తెదేపా నాయకులూ కోరుతున్నారు. అధికార పార్టీది మాటలే కానీ, చేతలు లేదని ఎద్దావా వేస్తున్నారు.