11, సెప్టెంబర్ 2023, సోమవారం

పోలీసుల అరెస్టుల మధ్య ప్రశాంతంగా బంద్

 



తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా  తెలుగుదేశం పార్టీ, జనసేనఇచ్చిన జిల్లా బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. బందుకు అడుగడుగునా పోలీసులు అవరోధాలు కల్పించారు. బందును విఫలం చేయాలని ప్రయత్నం చేశారు. బందును  పర్యవేక్షిస్తున్న నాయకులు,  కార్యకర్తలను అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముందు జాగ్రత్తగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులను హౌస్ అరెస్టు చేశారు. వారు బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. చిత్తూరులో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ లను పోలీసులు ఇళ్లలో బందించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ బందును  పర్యవేక్షణ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలో జరిగింది. బలవంతంగా పోలీసులు కాజూరు బాలాజీని అరెస్టు చేశారు. పూతలపట్టులో ప్రశాంతంగా బందు నిర్వహిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జ్ మురళీమోహన్, నాయకులు దొరబాబు, చంద్రమౌళి తదితరులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుప్పంలో ఉదయం నుంచే పోలీసులు బందును విఫలం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బందును పర్యవేదిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను అడ్డుకున్నారు. ఒక దశలో శ్రీకాంత్ కు పోలీసులకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. టీడీపీ అధిష్టానం బంద్ కు పిలుపు నివ్వగా చిత్తూరు జిల్లాలో స్వచ్ఛందగా బంద్ పాటించారు. జాతీయ రహదారిలోని దుకాణాలు బోసిపోయాయి. తెలుగు తమ్ముళ్లను ఎక్కడిక్కడే పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగించారు. జాతీయ రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా తెలుగుతమ్ముళ్లు టైర్లుకు నిప్పు పెట్టి, సి ఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై  జాతీయ రహదారుల్లో ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు అరెస్టు వార్త విని తట్టుకోలేక పెద్దపంజాణి మండలం కత్తెరపల్లికి చెందిన శంకరప్ప గుండెపోటు మరణించారు.


కుప్పంలో మాత్రం నిరసన ఉద్రిక్తంగా మారింది. స్వచ్ఛంధంగా తెలుగు తమ్ముళ్లు బంద్ కొనసాగిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, తమ్ముళ్లలకు కొద్దీ సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో కంచర్ల శ్రీకాంత్ పోలీసులకు దీటైన  సమాధానం చెప్పడంతో బంద్ కొనసాగింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసారంటూ రోడ్లపై టీడీపీ, జనసేనా, వామపక్షాలు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బంగారు పాళ్యం, పలమనేరు, యదమరి పలు చోట్ల తెలుగు తమ్ముళ్లను పోలీసులు ఉదయాన్నే అరెస్టులు పర్వం కొనసాగించి. స్థానిక పొలీస్ స్టేషన్లకు తరలించారు. మండలంలో 144 సెక్షన్ ఉన్నదని, బంద్ పాటించకుదని, టిడిపి బంద్ ను పోలీసులు నిర్వీర్యం చేసారు. కానీ ఎట్టకేలకు కుప్పం, పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట మండలాల్లో బంద్ పాటించారు. రోడ్డు పై బైఠాయించి, తమ అధినేతను అక్రమంగా అరెస్ట్ చేసారంటూ తెలుగు తమ్ముళ్లు మండి పడ్డారు. 

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను రిమాండ్ ను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో మాజీ  ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు నల్ల బెల్లూన్స్ ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ సి వి నాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ప్రదేశ్ ను అరాచకాలకు నిలయంగా చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి పైశాచిక  ఆనందం పొందుతున్నారని, మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకపోగా,  తప్పుడు కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయడం  అత్యంత దారుణమని వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని ఎస్ సి వి నాయుడు డిమాండ్ చేశారు. మర్డర్ కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా అడ్డుకుంటు, చంద్రబాబు నాయుడును తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేయడం అత్యంత దారుణం అన్నారు. గత మూడు రోజులుగా తమను గృహనిర్బంధం చేసి ప్రజల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ హక్కు అయినా నిరసన వ్యక్తం చేయకుండా చేస్తున్నారని తామేమైనా టెర్రరిస్టులమని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నారాయణ యాదవ్,  భాస్కర్ నాయుడు, బత్తయ్య, శేఖర్, చెంచు రామానాయుడు, మాజీ సర్పంచ్ హరి నాయుడు,  మునికృష్ణమనాయుడు, జానకి రామానాయుడు, అరవింద తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఆగిన గుండె

 మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును టీవీలో చూస్తూ తట్టుకోలేక ఓ తెలుగుదేశం పార్టీ అభిమాని గుండె ఆగిన సంఘటన పెద్దపంజని మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పెద్దపంజాణి మండలం మాదనపల్లె పంచాయతీ కత్తర్లపల్లికి చెందిన శంకరప్ప (50) తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మరియు నాయకులు.... ఇలా ఉండగా గత రెండు రోజులుగా చంద్రబాబు అరెస్టుపై జరిగిన నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.  ఈ నేపథ్యంలో  ఆయన ఆదివారం రాత్రి చంద్రబాబు అరెస్టును టీవీలో వీక్షిస్తూ మరింత మానసిక ఆవేదనకు లోనై గుండెపోటుకు గురి కావడంతో కుటుంబీకులు ఆయన్ను పుంగునూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. శంకరప్ప మృతి పట్ల పెద్దపంజాణి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని వ్యక్తపరిచారు. అలాగే పలమనేరు మాజీ MLA అమరనాధ రెడ్డి సానుభూతిని వ్యక్తపరచారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 



 చంద్రబాబు పై అక్రమ అరెస్టును నిరసిస్తూ  శాంతియుతంగా బంధు నిర్వహిస్తున్న చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు  కాజురు బాలాజీని, టిడిపి శ్రేణులు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. బందును పర్యవేక్షిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేయడానికి ప్రయత్నం చేశారు. బాలాజీ ప్రతిఘటించడంతో వాగ్వివాదం జరిగింది. బాలాజిని బలవంతంగా జీపులోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. ఒక దశలో బాలాజీ కింద పడిపోయారు. బాలాజిని పోలీసులు చుట్టిముట్టి, లిఫ్ట్ చేసి జీపులో ఎక్కించారు. పెనుగులాటలో  బాలాజీ  షర్టు కూడా చినిగిపోయింది. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును ఒక్క రోజైనా జైల్లో పెట్టాలని అక్కసుతో ఈ  ఉన్మాదానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని విమర్శించారు. ఈ  అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య దేశానికి చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆవేదనతో ఊగిపోయారు.. త్వరలో  జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలియజేయడంహెచ్చరించారు.



పూతలపట్టులో తెలుగుదేశం శ్రేణులు ప్రశాంతంగా బంద్ చేస్తుంటే, హైవే పై ఆగి ఉన్న బస్ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు  పగలకొట్టి పరారు అయ్యారు.  ఇందుకు  తెలుగుదేశం పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ను,  ఆయనతో పాటు పూతలపట్టు మండల అధ్యక్షుడు దొరబాబు చౌదరి  మరి కొంతమంది నాయకుల్ని అదుపులోకి తీసుకోని,  పూతలపట్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గం కార్యకర్తలు,  ప్రజా ప్రతినిధులు పూతలపట్టు స్టేషన్ వద్దకు చేరుకోకున్నారు.  పూతలపట్టు స్టేషన్లో ఉన్నటువంటి  ఇన్చార్జిని, మండల అధ్యక్షులు దొరబాబు చౌదరిని, మాజీ మండల అధ్యక్షులు చంద్రమౌళిని కాంతారావుని, మిగిలిన నాయకులను  చిత్తూరుకు తరలించారు.



బంద్ సందర్భంగా జనసేన పార్టీ జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న, మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ ను కార్వేటినగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిడిపి ఇంచార్జ్ డాక్టర్ థామస్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం అయింది.  కార్వేటినగరం పోలీసులు అందరిని బైండోవర్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.  ఈ బంద్ కార్యక్రమంలో టిడిపి నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు.



టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది.జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు టీడీపీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేసారు. మదనపల్లి నిమ్మనపల్లి సర్కిల్ లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో రోడ్డు మీద బైటయించి నిరసన తెలియజేయడం జరిగింది. టిడిపి బంద్ కు మద్దతు ఇస్తున్న జనసేన నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం,రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు,ఐటీ విభాగ నాయకులు జగదీష్, కుమార్, నవాజ్, నారాయణ స్వామి, జనర్దన్ తదితరులు పాల్గొన్నారు.


 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మదనపల్లెలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యార్థం నిమిత్తం ఆర్టీసీ సర్వీసులను యధావిధిగా కొనసాగించారు. ప్రజా కార్యకలాపాలు కొనసాగాయి. పోలీసులు పట్టణంలో కలియా తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చర్యలు తీసుకున్నారు. టీడీపీ, జనసేన ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంతో పాటు హౌస్ అరెస్టులు చేసి ఇళ్ల వద్ద కాపలా ఉన్నారు. జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి కార్యకర్తలతో కలసి నిమ్మనపల్లె సర్కిల్ లో నిరసన చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అలాగే టీడీపీ యువ నేత దొమ్మలపాటి యశస్విరాజ్ శివనగర్ లోని తన నివాసం వద్ద కార్యకర్తలతో కలసి నిరసన వ్యక్తం చేస్తుండగా తాలూకా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇందులోభాగంగా మొత్తం 30 మందిపై ప్రివెంటివ్ కేసులు నమోదు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 






అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *