29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

DA శ్రీనివాస్ చుట్టూ చిత్తూరు రాజకీయం

DA శ్రీనివాస్ కోసం మూడు పార్టీల ఎదురుచూపు 
ఇంకా నిర్ణయం తీసుకోని శ్రీనివాస్ 
శ్రీనివాస్ కాదంటేనే వేరే వారికీ టిక్కెట్టు 


చిత్తూరు నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం డీకే ఆదికేశవులు కుమారుడు డి ఎ శ్రీనివాసు చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు ఆయన కేంద్రబిందువుగా మారారు. రానున్న ఎన్నికల్లో ఆయనను చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి మూడు పార్టీలు పోటీలు పడుతున్నాయి. అయితే డిఎ శ్రీనివాసులు ఇప్పటివరకు తన మనసులోని మాటను బయట పెట్టలేదు. ఎవరు అడిగినా తనకు కుటుంబ సమస్యలు కొన్ని ఉన్నాయని వాటిని పరిష్కరించుకున్న తర్వాత చెబుతానని అంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో డి ఎ శ్రీనివాస్ తన వైఖరిని తెలియజేసిన తర్వాతనే ఏ పార్టీ అయినా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం రాజకీయము ప్రస్తుతం డి ఎ శ్రీనివాసులు చుట్టూ తిరుగుతోంది అనడంలో అతిశయోక్తి లేదు.


డి ఎ శ్రీనివాస్ తండ్రి DK ఆది కేశవులు కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెస్, తెదేపా పార్టీలకు కోశాధికారిగా పనిచేశారు. ఆయన పలుమార్లు టిటిడి చైర్మన్ గా పనిచేశారు. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి డీకే సత్యప్రభ తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె మరణానంతరం DK ఆదికేశవులు కుటుంబం రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీకి సన్నిహితంగా లేరు. అయితే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సత్సంబంధాలను నెలపుతున్నారు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబం కావడంతో అందరి దృష్టి DA శ్రీనివాసులు పైన పడింది. చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉంటున్నారు. కావున ఏ పార్టీ టికెట్ ని కేటాయించినా, బలిజ కులస్తులకు ఇవ్వడం ఈమధ్య ఆనవాయితీగా వస్తోంది. కావున బలిజ కులానికి చెందిన DA శ్రీనివాసులు చిత్తూరులో అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు.


ఆదికేశవ నాయుడు సతీమణి డీకే సత్య ప్రభ మరణించే నాటికి ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కావున తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీలో చేరి చిత్తూరు అసెంబ్లీకి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నారు. శ్రీనివాసులు కాకుండా వారి కుటుంబ సభ్యులలో ఎవరు పోటీ చేసిన సిద్ధమేనని అంటున్నారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా డి ఎ శ్రీనివాస్ ని కలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు నుండి పోటీ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. లేకుంటే రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేసినా, తమకు అభ్యంతరం లేదని అన్నట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవి కుటుంబ సభ్యులతో డీకే కుటుంబ సభ్యులకు చాలా సన్నిహిత్యం ఉంది. వీరు స్నేహితులుగా, బందువులుగా కలిసిపోయారు. చిరంజీవికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ డి ఎ శ్రీనివాసులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కావున జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులకు కూడా కోరుతున్నారు. ఇలా మూడు పార్టీల నేతలు DA శ్రీనివాసులు తిరుగుతున్నారు. అయితే డి ఎ శ్రీనివాస్ తన మనసులోని మాటను మాత్రం ఇంతవరకు బయట పెట్టలేదు.


డి ఎ శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి పోటీ చేయవచ్చని ప్రచారం కూడా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందితే, మంత్రిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం గాలిగోపురాన్ని బంగారు తాపడం చేయించడానికి కృషి చేస్తారని ప్రచారం జరుగుతోంది. DA శ్రీనివాసులు తండ్రి DK ఆదికేశవులు పలుమార్లు టీటీడీ చైర్మన్ గా సేవలు అందించారు. టీటీడీ వెంకన్న గాలి గోపురాన్ని బంగారు తాపడం చేయాలనే ఆయన ఆశయం నెరవేరలేదు. కావున డి ఎ శ్రీనివాసులు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి ఆదికేశవులు ఆశయాన్ని పూర్తి చేస్తారని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆయన నిర్ణయం కోసం తెలుగుదేశం పార్టీ, YSR కాంగ్రెస్ పార్టీ, జనసేన నాయకులు ఎదురుచూస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *