శ్రీకాళహస్తిలో కనిపించని బొజ్జల సుధీర్ !!
అయితే కాళహస్తి దేశం ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి ఇవి ఏవీ పట్టలేదు. ఆయన గత మూడు రోజులుగా పత్తా లేకుండా పోవడం దేశం శ్రేణులలో త్రీవ అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బాబును అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయా నియోజక వర్గం ఇంచార్జిలను పార్టీ అధిష్టానం అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఆ రోజు రాత్రి చెన్నైలో వున్న బొజ్జల సుధీర్ రెడ్డి హుటా హుటినా కాళహస్తి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉన్నా, చెన్నై నుంచి మధ్యాహ్నం గానీ రాలేదు. అప్పుడు కూడా సత్య వేడులోనే పోలీసులు అదుపు లోకి తీసుకొని అక్కడే ఉంచారు. ఆ రాత్రికి అయిన కాళహస్తి చేరుకుని రెండో రోజు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తారని భావించిన పార్టీ నాయకులకు నిరాశ ఎదురైంది. సుధీర్ రెడ్డి అటే చెన్నైకు వెళ్లి పోవడంతో ఆందోళన కార్యక్రమాలు బాధ్యత స్థానిక నాయకులపై పడింది. ఆది నుంచి పార్టీ పట్ల వీరవిధేయత, చంద్రబాబుపై అపార అభిమానం ఉన్నా, ముందుండి నడిపే నాయకుడు లేకున్నా ఉన్న నాయకులు పోరాటం చేపట్టారు. పోలీసులను లెక్క చేయక నిరసనలు చేశారు.
స్థానికంగా ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఉన్నా, శ్రీకాళహస్తి వదలి పెట్టీ అధిష్టానం వద్ద మార్కులు పొందేలా విజయవాడకు వెళ్లడం ఏమిటి అని నాయకులే ప్రశ్నించారు. ఆది నుంచి స్థానికంగా ఉండి పార్టీని నడపడం లేదున్న అపకీర్తి వున్నా, బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీ అధినేతనే అరెస్టు చేసినా కాళహస్తిలో నిరసనలు గాలికి వదలి విజయవాడకు వెళ్లడంపై పార్టీ శ్రేణులకు ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయేలా చేసింది. పుండుపై కారం చల్లిన్నట్లు పోలీసులను ఎదిరించి నిరసనలు చేసిన నాయకులపైనా ఏకంగా 16 మందిపై హత్యాయత్నంతో సహా తీవ్ర సెక్షన్ లతో పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపారు. మీకు ఏదైనా జరిగితే దిక్కు ఎవురు అని వైసిపి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నట్లు కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు.
ముందు వుండి నడిపించాల్సిన నాయకుడు పత్తా లేకుండా పోవడం, ముందు వుండి పార్టీ నీ నడిపిన నాయకులు కేసులలో ఇరుక్కు పోవడం కార్యకర్తలను డీలా పడేలా చేశాయి. సుధీర్ రెడ్డి విజయవాడ నుంచి పంపుతున్న వాట్సప్ సందేశాలు చూసి, నాయకులు ఉత్తర ప్రగాల్బులు తలపిస్తున్నాయి అని అంటూ తలలు పట్టు కోవడం కోస మెరుపు. వైసిపి నాయకులు హేళనలు దేశం నాయకులు మరింత కృంగదీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహార శైలితో కాళహస్తి లో తెలుగు దేశం ఉనికికే ప్రశ్నర్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT US ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.