చంద్రబాబుకు క్రమంగా పెరుగుతున్న ఆదరణ
బాబు కోసం మొదటిసారి రోడ్డెక్కిన IT ఉద్యోగులు
హైదరాబాద్, బెంగుళూరుల్లోను నిరసనలు
జాతీయ స్థాయిలో బాబుకు పెరిగిన మద్దతు
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చంద్రబాబుకు రోజు రోజుకూ మద్దతు, ఆదరణ పెరుగుతోంది. ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి. మొట్టమొదటి సారిగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డు ఎక్కారు. బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో భారీ ఎత్తున శుక్రవారం ఐటీ ఉద్యోగులు ఆందోళన చేశారు. అక్రమంగా బాబును అరెస్టు చేశారని ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. వర్షం పడుతున్న లెక్కచేయకుండా ఐటి ఉద్యోగులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబుకు మద్దతుగా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బెంగళూరు జయనగర్ కాలనీలోని వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ చేపట్టారు. దీంతో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శుక్రవారం హైదరాబాదులోని హైటెక్ సిటీ వద్ద ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జగన్ని కు వ్యతిరేకంగా నాదాలు చేశారు. ఏపీలో కక్ష్య సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధి అవరోధం అన్నారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో సైబర్ టవర్ వద్ద ఎలాంటి ఆందోళన చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి వెళ్లిపోవాలని కోరారు. ఎంతకీ ఉద్యోగులు వెళ్లకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెయిల్ ద్వారా IT ఉద్యోగులకు పోలీసులు నోటీసులు జారీ చేయించారు. కంపెనీల ద్వారా పోలీస్ మెయిల్స్ పంపుతున్నారు. చంద్రబాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసులు హెచ్చరిస్తున్నారు.
జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబుకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తొలుత జాతీయస్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపే.. చంద్రబాబు అరెస్ట్ కు కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనది అక్రమ అరెస్ట్ అని.. అరెస్టు చేసే తీరును తప్పు పడుతూ ఏపీ, తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఖండించాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వామపక్షాల నాయకులు నారాయణ, రాఘవులు, తెలంగాణకు చెందిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చారు. మరోవైపు జాతీయ స్థాయిలో సైతం నాయకులు స్పందించి సంఘీభావం తెలపడం విశేషం. తరువాత సమాజ్ వా ది పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాళిదళ్ అధ్యక్షుడు సుక్విర్సింగ్ బాదల్, కర్ణాటక మాజీ సీఎం, జేడిఎస్ నేత కుమారస్వామి, ఆర్జేడి ఎంపి మనోజ్ తదితరులు స్పందించి సంఘీభావం తెలపడం విశేషం. అయితే ఇలా స్పందిస్తున్న జాతీయ నాయకుల్లో విపక్ష ఇండియా కూటమికి చెందిన వారే అధికంగా ఉండడం విశేషం.
గత కొద్దిరోజులుగా చంద్రబాబు జాతీయ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బిజెపి విషయంలోనే సానుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ ఇండియా కూటమికి చెందిన నాయకులు చంద్రబాబుకు మద్దతుగా నిలవడం విశేషం. జగన్, మోడీ సంయుక్త కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, BJP తెలంగాణ నేత బండి సంజయ్ కూడా అరెస్టు విషయంలో స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తప్పు పట్టారు. నోటిసులు ఇచ్చి విచారణ చేయకుండా, అధారాలు చూపకుండా, నేరుగా అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబును పరామర్శించారు. పూర్తి మద్దతు ప్రకటించారు. రానున్న ఎన్నికలలో కలిసి పోటి చేస్తామని ప్రకటించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బాబు అరెస్టును ఖండించారు. ఈ మేరకు నారా లోకేష్ కు ఫోన్ చేశారు. అయన శనివారం రాజమహేంద్రవరం వచ్చి బాబును పరామర్శించనున్నారు.