రాష్ట్ర తిదేప కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట నందు రాష్ట్ర తిదేప కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుపై వున్న కేసులు కొట్టివేసి ఆయురారోగ్యాలతో త్వరగా బయటికి రావాలని ముస్లిం మైనారిటీ మహిళలతో అల్లాహ్ ని దువా చేసి, బాబుతోగారితో మేము అనిప్లకార్డులు పట్టుకొని నిరసనతెలిపారు.
ఈసందర్భంగా రాష్ట్ర తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి పర్వీన్ తాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పార్టీ నాయకులు ఓటమి భయంతో, కక్షతో చంద్రబాబునాయుడును ఆక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తద్వారా తెదేపా శ్రేణుల్లో, ప్రజల్లో భయాందోళనలకు కలగచేయాలని చూడడం సరైంది కాదన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజన ఏపీలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులవలె ముందుకు తీసుకెళ్లారని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చేసిన మహా నాయకుడు చంద్రబాబు అలాంటి నాయకుడిని అరెస్టు చేయడం వైసిపి పార్టీ వారి గొయ్యి వాళ్ళేతవ్వుకున్నట్లైందని ఆమె అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది అన్నారు
ఈకార్యక్రమంలో షఫీవుల్లా, మదార్ సాబ్, చావడి కిట్టన్న, ప్రభాకర, రవికుమార్, మస్తాన్ రెడ్డి, చంద్రశేఖర్, గట్టు.చంద్రన్న, లతీఫ్, సుబ్బమ్మ, బాబు తదితరులు పాల్గొన్నారు