20, సెప్టెంబర్ 2023, బుధవారం

C ఓటరు సర్వేలో సంచలనాలు




టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో తాజా పరిస్థితులపై సి ఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి, టిడిపికి విపరీతమైన సానుభూతి వచ్చిందని సి ఓటర్ సర్వే వెల్లడించింది. చంద్రబాబు అరెస్టుతో జగన్ లో అభద్రతాభావం పెరిగిపోయిందని సి ఓటర్ సర్వే తేల్చింది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి సానుభూతి దొరుకుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లుగా పేర్కొంది. సి ఓటర్ సర్వేను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది.  


దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీ నేతృత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రిపబ్లిక్‌ టీవీ, సీ-వోటర్‌ సర్వే నిర్వహించింది. ఈ మేరకు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు ఆ సర్వే ప్రకటించింది. ఏపీలో టిడిపికి రాజకీయ వాతావరణం ఇబ్బందికరంగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు పరిణామాలపై సి ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడి కావడంతో వైసీపీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. చంద్రబాబు అరెస్టు టిడిపికి కలిసొస్తుందా? లేక నష్టం చేస్తుందా? అనేది మాత్రం ముందు ముందు తేలనుంది.


మొత్తం 1809 మంది నమూనా పరిమాణం ఈ సర్వేలో పాల్గొనగా మొత్తం చంద్రబాబు నాయుడుపై ఆయన అరెస్టు చేయడం వల్ల సానుభూతి పెరుగుతుందని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టు వల్ల చంద్రబాబు నాయుడుకి ప్రజలలో సానుభూతి పెరుగుతుందని పేర్కొన్నారు. 36 శాతం మంది ఈ అరెస్టు జగన్ రెడ్డికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టుతో ఓటర్లలో చంద్రబాబు పట్ల సానుభూతి పెరుగుతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. 53 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ వాసులు చంద్రబాబు అరెస్టు వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. 


కాగా చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్‌: విజయవాడ: తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబును తమ కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు..


చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారన్నారు. 'ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలి. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం. చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్‌ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది'' అని సుధాకర్‌ రెడ్డి వాదించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు కొనసాగుతున్నాయి..

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *