17, సెప్టెంబర్ 2023, ఆదివారం

చవితి రోజు చంద్రున్ని చూస్తే.... !?

 


వినాయక చవితి వచ్చిందంటే గ్రామాల నుండి పట్టణాల వరకు ఒకటే సందడి. చవితి పండుగను అందరికంటే గొప్పగా చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ముందుగా యువజన సంఘాలు చందాల వసూళ్లకు బయలుదేరుతాయి. వినాయక చవితికి పందిళ్లు ఏర్పాటు అవుతాయి. అందరికంటే సుందరంగా, ఎత్తుగా ఉన్న వినాయక విగ్రహాలను తీసుకు వస్తారు. తొమ్మిది రోజులపాటు పండుగే పండుగ.  వినాయకుని విగ్రహాలు వెలియని వీధి, గ్రామం అంటూ ఉండదు. ప్రతి వీధిలో వినాయకుడు కొలువై ఉంటాడు. ఏ పని ప్రారంభించాలి అన్నా, ముందుగా వినాయకునికి పూజ చేయాలి. అప్పుడే  అవిఘ్నంగా ఏ పని అయినా పూర్తి అవుతుంది. కావున ముందుగా వినాయకుని పూజించి ఏ పనైనా, వ్రతమైనా, పూజ అయిన ప్రారంభించడం ఆనవాయితీ. ఇంత ఘనంగా వినాయకుని పండుగ జరుపుకుంటున్న సమయంలో పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నీలాపనిందలు తప్పవని పురాణాలు చెబుతున్నాయి. చవితి రోజు చంద్రుని చూడడం వలన కష్ట నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని ఘోషిస్తున్నాయి. వినాయక చవితి రోజు ఏమరిపాటుగా శ్రీకృష్ణ భగవానుడు చవితి చంద్రుడిని చూడడంతో ఆయన మీద శమంతకమణి అపహరించారని అపవాదు వచ్చింది. దీంతో అపవాదును పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు జాంబవంతునితో యుద్ధం చేయవలసి, శామంతకమణిని తెచ్చి రాజుకు ఇవ్వల్చి  వచ్చింది. దేవదేవుడు అయిన శ్రీకృష్ణునికే నీలాప నిందలు తప్పలేదు. మరి నర మానవులైన మనం ఎంత ? దీని వెనుక ఒక కథ ఉంది.

పురాణాల ప్రకారం.. కైలాసంలో శివుడి కోసం పార్వతి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే శివుడు ఎంతకీ రాకపోయే సరికి స్నానానికి సిద్ధమవుతుంది. అయితే స్నానానికి వెళ్లే ముందు పార్వతీ మాత నలుగు పిండితో ఒక బొమ్మను తయారుచేసి ఇంటి ప్రధాన ద్వారం ముందు కాపలాగా పెడుతుంది. అయితే పార్వతి స్నానం చేసే సమయంలో శివుడు వస్తాడు. కాపాలాగ ఉన్న గణపతి శివుడిని లోనికి పోకుండా అడ్డుకుంటాడు. దీంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ బొమ్మ తలను శూలంతో నరికేస్తాడు. ఆ సమయంలో బయటకొచ్చిన పార్వతీ మాత ఎంతో దుఖిస్తుంది. తను నా బిడ్డ.. నా బిడ్డను బతికించండని శివుడిని వేడుకుంటుంది. దాంతో మహాదేవుడు ఏనుగు తలను బొమ్మ మొండానికి అతికించి ప్రాణం పోస్తాడు. అలాగే గజాననుడు అని పేరుకూడా పెడతాడు. 


దేవతలంతా గణేషుడిని ఆశీర్వదిస్తే.. ఒక్క చంద్రదేవుడు మాత్రం నవ్వుతాడు. ఎందుకంటే గణేషుడు ఏనుగు తలతో నడవడానికి ఇబ్బంది పడతాడు. గణపతిని అవమానిస్తూ చంద్రుడు నవ్విన విషయం గణేషుడికి అర్థమైపోతుంది. నీ ఆకారాన్ని చూసుకుని గర్వపడుతున్నావనీ.. గణపతికి పట్టరాని కోపం వచ్చి నువ్వు ఎప్పటికీ చీకటిగానే ఉంటావని.. అలాగే భాద్రపద శుద్ద చవితినాడు  చంద్రున్ని ఎవరైతే చూస్తారో.. వారు ఇతరులచే నిందలు పడతారని శాపం పెడతాడు. అయితే దేవతలందరూ గణేషుణ్ణి శాంత పరిచి శాపాన్ని వెనక్కి తీసుకోవాలని వేడుకుంటారు. చంద్రుడు కూడా తన తప్పును తెలుసుకుని క్షమాపనలు కోరుతాడు. అయితే అప్పుడు గణేషుడు నెలకు ఒకసారి మాత్రమే నీ పూర్తి ఆకారంలో కనిపిస్తావని శపిస్తాడు. దీనితో పాటుగా నా ఆరాధన సమయంలో చంద్రున్ని ఎవరైతే చూస్తారో వారు ఇతరులచే మాటలు, నిందులు పడతారని విఘ్నేషుడు అంటాడట. ఈ కారణంగానే చతుర్థి నాడు చంద్రున్ని చూడకూడని నమ్ముతారు. అయితే గణపతిని పూజించిన అక్షితలు తల మిద వేసుకోవడం వలన ఉపశమనం కలుగుతుందని పండితులు చెపుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *