పోలీసు స్టేషన్లో లొంగి పోయిన చల్లా బాబు !
పుంగనూరులో నియోజకవర్గ టిడిపి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి సోమవారం పుంగనూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆయనతో పాటు కేసుల్లో ఉన్న మరో 60 మంది కార్యకర్తలు కూడా లొంగిపోయారు. గత నెల నాలుగవ తేదీ పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన దాడుల్లో చల్లా పై ఏడు కేసులు నమోదు అయ్యాయి. అందులో నాలుగింటికి హై కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
పెడ్డిరెడ్డి అంటే మరీ ఇంత భయమా ?
చల్లా బాబు పరామర్శించడానికి పలువురు రాష్ట్ర నాయకులు వచ్చారు. అయితే ఒక్క నాయకుడు కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయక పోవడం విశేషం. కొంత మంది నాయకులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని విమర్శలు చేశారు, తప్ప పెద్దిరెడ్డి పేరు కూడా ఎత్తలేదు. టిడిపి అనుకూల ఛానళ్ళు కూడా విమర్శలను ప్రోత్సహించలేదని సమాచారం. పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం, పాలన, అరాచకాలపై విమర్శలు చేశారు, తప్ప పెద్దిరెడ్డిపై ఘాటైన విమర్శలు చేయలేదని తెలిసింది.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.