21, సెప్టెంబర్ 2023, గురువారం

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రాహ్మిణి !?

నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం

యువగళం ఆగకుండా నారా బ్రాహ్మిణికి భాద్యత 

నారా భువనేశ్వరి, బాలకృష్ణ కూడా రంగంలోకి 

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు ప్రణాళికలు 







వరస  అరెస్టులతో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో కురుకుపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణిలను  తెరమీదకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఆయన మీద వరుస కేసులను నమోదు చేస్తున్నారు. మూడు, నాలుగు నెలల పాటు చంద్రబాబును జైల్లోనే ఉంచాలి అన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఎందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పాత కేసులను తిరగతోడుతున్నారు. కేసులతో చంద్రబాబు నాయుడును ఇరికించి ఆయనను ఎన్నికల వరకు వెలుపలకు రాకుండా చూడాలనే  వ్యూహరచనలో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారు.

చంద్రబాబు అరెస్టు కావడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. పార్టీలో దిశా నిర్దేశం చేయగలిగే నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ద్వితీయ స్థాయి నాయకత్వం ఎదగకుండా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 అంటూ ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే అది ఆయన కుమారుడు లోకేష్ మాత్రమే. లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో మమేకమవుతున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు అనేక అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులలో అనేక గుణపాటాలు నేర్చుకొని ఒక నాయకుడిగా రాటుతేలుతున్నారు. ముద్దపప్పు అన్న ప్రచారంనుండి లోకేష్ క్రమంగా బయటపడుతున్నారు. పరిణితి గలిగిన ఒక రాజకీయ నాయకుడిగా తయారవుతున్నారు. పాదయాత్రలో ఎక్కడ సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని, ఎక్కడికక్కడ హామీలను ఇస్తూ పాదయాత్ర కొనసాగుతోంది. లోకేష్ కు భారీ ఆదరణ లభించడంతో పార్టీలో నంబర్ 2 నారా లోకేష్ అని చెప్పవచ్చు.

ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్ కూడా తొందరలోనే అరెస్టు చేస్తారని వైసీపీ శ్రేణులు విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కూడా సిఐడి పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నారా లోకేష్ హస్తినలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులను కలిసి మద్దతు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రాగానే అరెస్టు తప్పదని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. లోకేష్ అరెస్ట్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు మానసికంగా సిద్ధమయ్యారు.

నారా లోకేష్ అరెస్టు చేస్తే పార్టీని ముందుండి నడిపే నేత కోసం అన్వేషణ సాగుతోంది. ఇటీవల మొట్టమొదటిసారిగా నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమై బాబు అరెస్టు తరువాత తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు. అనంతరం ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం శ్రేణులకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు మనమరాలు, నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రభుత్య  వైఖరిని ఎండగడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు సూటిగా, నిశితంగా విమర్శలు చేస్తున్నారు.  తారడుకోకుండా చేస్తున్న వ్యాఖ్యలు  ఆకట్టుకుంటున్నాయి. లోకేష్ అరెస్ట్ అయితే ఒకవైపు నారా బ్రాహ్మణి, మరోవైపు నందమూరి బాలకృష్ణ, మరోవైపు నారా భువనేశ్వర్లు బాధ్యతలు తీసుకొని రాష్ట్ర మొత్తం పర్యటించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక లోకేష్ కూడా అరెస్టు అయితే యువగళం పాదయాత్రకు పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కావున జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ఆయన సోదరి షర్మిల పాదయాత్రను పూర్తి చేసిన విధంగా, తెలుగుదేశం పార్టీలో కూడా నారా బ్రాహ్మణి పాదయాత్రను పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేత అన్నయ్య పాత్రుడు బుధవారం ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఈ ప్రకటన పార్టీలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పార్టీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. గోప్యంగా ఉంచాల్చిన  అంశాలను ముందుగా ప్రకటించడం పట్ల అయ్యన్నపాత్రుడపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే లోకేష్ అరెస్ట్ అవుతారనీ, బ్రాహ్మణ పాదయాత్ర చేస్తుందని  ప్రకటనలు చేసి ప్రత్యర్థి పార్టీకి ఆయుధాలు అందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీని ఈ సంక్షోభం నుంచి రక్షించుకోవడానికి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ లు ప్రజల వద్దకు వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ అవినీతి అక్రమాలను వివరించే అవకాశం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *