30, సెప్టెంబర్ 2023, శనివారం

భవ్యశ్రీ హత్యపై సమగ్ర విచారణ చేపట్టాలి

కలెక్టరేట్ ముందు ప్రజా సంఘాల ధర్నా

ధర్నాకు వస్తున్న వారిపై వారిని అరెస్టు చేయడం బాధాకరం

భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి  

ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్



పెనుమూరు మండలంలో  వేణుగోపాలపురంలో భవిశ్రీ హత్య జరిగి 15 రోజులు అవుతున్న ఇప్పటివరకు విచారణ చేసి నిందితులను అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని గంగరాజు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద  ప్రజా సంఘాలు అఖిల పక్షం ఆధ్వరంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ భవ్యశ్రీ విద్యార్థిని హత్య వెనుక ఉన్న వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. విచారణ చేయడానికి ఇన్ని రోజులు పడుతుందా అని ప్రశ్నించారు. హత్యపై రకరకాల కథనాలు అల్లుతున్నారని దీనిపై రోజురోజుకీ పోలీస్ అధికారులపై అనుమానాలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన డిమాండ్ చేశారు. 

అతి దారుణంగా హత్య చేసిన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారని చెప్పడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకోడానికి 15 రోజులు పడుతుందా అని ప్రశ్నించారు. సామాన్య వ్యక్తులు చనిపోతే ఒక రకంగా ధనవంతులు చనిపోతే ఒక రకంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పెనుమూరు మండలంలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వలన ఇలాంటి ఘటనలకు సరైన న్యాయం జరగడం లేదని తెలిపారు. 

గతంలో అధికారులు తీరు వలన రైతు తాసిల్దార్ కార్యాలయంలోని చనిపోయిన సంఘటన పెనుమూరులో చూశామన్నారు. అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు తీరు పెనుమూరులో చూశామని వివరించారు. ఇలాంటి ఘటనలో నిరంతరం పెనుమూరులో జరుగుతున్న జిల్లా కేంద్రానికి కూతవేట దూరంలో ఉన్న పెనుమూరులో  ఘటనలపై ఎందుకు ఉన్నతాధికారులు మౌనం పాటిస్తున్నారని అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్తులో భవ్య శ్రీ లాంటి విద్యార్థులు ఎవరికి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, జిల్లా అధికారులదే అని స్పష్టం చేశారు.

జిల్లాలో ఉన్న మంత్రులు ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటనీ, ఇప్పటికైనా హత్యపై సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం, పలు ప్రజా సంఘాలు, బీసీవై , సిపిఐ, మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *