చిత్తూరులో బీసి భవన్ ప్రారంభం
చిత్తూరులో రూ. 4.43 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిరావుఫూలే నూతన భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, రాష్ట్రఅటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం చిత్తూరు లో పి వి కే ఎన్ డిగ్రీ కళాశాలసమీపంలో నూతనంగా నిర్మించినమహాత్మా జ్యోతి రావు ఫూలే భవనానికి ప్రారంభోత్సవము జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, చిత్తూరు ఎం పి ఎన్. రెడ్డప్ప,జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్, ఎం ఎల్ సి భరత్, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద, డి ఆర్ ఓ ఎన్. రాజ శేఖర్, రాష్ట్ర ఎ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ శాంతి, డి సి సి బి చైర్ పర్సన్ రెడ్డమ్మ, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్ పర్సన్ శైలజా రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ చంద్ర శేఖర్ రెడ్డి, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, బిసి, సాంఘిక సంక్షేమ శాఖ ల డిడి లు రబ్బానీ భాష, రాజ్యలక్ష్మీ, ఎ పి ఈ డబ్ల్యూ ఐ డి సి ఈఈ శివ ప్రసాద్, చిత్తూరు ఆర్డిఓ రేణుకా, ఎపి ఎస్ పి డి సి ఎల్ ఈఈ పద్మనాభ పిళ్ళై, సంబంధింత అధికారులు, బిసి నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.