6, సెప్టెంబర్ 2023, బుధవారం

తిరుపతి పార్లమెంట్ రేసులో శ్రీదేవి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న రెండు లోక్ సభ స్థానాలలో  టిడిపిలో అభ్యర్ధులు ఎవరన్నది ఇంకా తెలియడం లేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి మాత్రం గట్టి పోటీ కనిపిస్తున్నది. గతంలో రెండుసార్లు పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తిరిగి పోటీ చేస్తారని మొన్నటి వరకు చెప్పారు. ఆమె తనకు గూడూరు లేదా సూళ్లూరుపేట అసెంబ్లీ టిక్కెట్టు కావాలని కోరినా, చంద్రబాబు లోక్ సభకు పోటీ చేయమని చెప్పినట్టు ప్రచారంలో ఉంది. అయితే   కొత్తగా వైసిపి అసమ్మతి నేత తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఆమేరకు లోకేష్ ను కలసి హామీ పొందినట్టు తెలిసింది. కాగా పొత్తు ఉంటే  ఈ స్థానం కోసం బిజెపి పట్టు బట్టే అవకాశం ఉందంటున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ టిడిపితో పొత్తు వల్ల బిజెపి అభ్యర్ధి  కారుమంచి జయరామ్ పోటీ చేశారు. ఆయన వైసిపి అభ్యర్థి వరప్రసాదరావు చేతిలో 37,425 ఓట్ల తేడాతో ఓడి పోయారు. 2019 టిడిపి అభ్యర్థిగా పనపాక లక్ష్మి పోటీ చేసి బల్లి దుర్గాప్రసాద్ రావు చేతిలో 2,28,376 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఆయన మరణంతో 2021 లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి పనపాక లక్ష్మి టిడిపి టిక్కెట్టుపై పోటీ చేసి వైసిపి అభ్యర్థి ఎం. గురుమూర్తి చేతిలో 2,71,592 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఈ నేపథ్యంలో శ్రీదేవికి లోక్ సభ టిక్కెట్టు ఇస్తే పనపాక లక్ష్మికి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని అంటున్నారు. ఈ నియోజక వర్గం  పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నారు.

చిత్తూరు లోక్ సభ స్థానం ఎవరికి ఇస్తారో  తెలియక పోయినప్పటికీ ఇటీవల టిడిపిలో చేరిన విశ్రాంత ఎస్పీ పి చిన్నస్వామి టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని సమాచారం. కాగా మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ అల్లుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో కోడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా పాలసముద్రం మాజీ జెడ్పీటీసీ, మాజీ  ఎంపిపి రాజేంద్ర కూడా రేసులో ఉన్నారు. విద్యావంతుడు అయిన ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో కుప్పంలో చంద్రబాబు మినహా మిగిలిన ఆరు స్థానాలలో వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఎన్ శివప్రసాద్ వైసిపి అభ్యర్థి సామాన్య కిరణ్ పై 44,138 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 లో ఆయన వైసిపి అభ్యర్ధి ఎన్ రెడ్డెప్ప చేతిలో 1,37,271 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజక వర్గం పరిధిలో కె నారాయణ స్వామి ఉప ముఖ్య మంత్రిగా, ఆర్ కె రోజా మంత్రిగా ఉన్నారు. కాబట్టి గట్టి అభ్యర్థిని రంగంలో దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT  US ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *