4, సెప్టెంబర్ 2023, సోమవారం

కాణిపాకం అర్చకుల లీలలు ఎన్నో!

కానుకలు వద్దన్నందుకు అభిషేకానికి మంగళం !

అర్చకుని ఇంట్లో జింక చర్మాలు !

1.5 లక్షల నిత్యావసరాలు స్వాహా! 

దేవుడి కానుకలు సైతం స్వాహా !

నెట్టింట్లో మూలవిరాట్ ఫోటోలు ! 

చాటింగ్ చేస్తూ.. చతుర్థి  వ్రత పూజ !






ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం అర్చకుల వైఖరి కారణంగా తరచుగా వార్తల్లోకి ఎక్కుతోంది. వివాదాల్లో చిక్కుకుంటున్నది. ఆలయ ప్రతిష్ట మసకబారుతోంది. EO వెంకటేష్ నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నా, పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఆంజనేయ స్వామి దేవాలయంలో పళ్లెంలో కానుకులను స్వీకరించకూడదు అన్నందుకు అర్చకులు అభిషేకానికే తిలోదకాలు ఇచ్చేశారు. ఈవో చేసిన ఆకస్మిక తనిఖీల్లో 1.5 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులు పట్టుబడ్డాయి. ఒక అర్చకుని ఇంట్లో రెండు జింక చర్మాలను గుర్తించారు. దేవుడికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు కూడా మాయమవుతున్నాయి. వాటికీ రశీదులు ఇవ్వకుండా స్వాహా చేస్తున్నారు. పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి దంపతులు వచ్చినప్పుడు మూలవిరాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇటేవల నిర్వహించిన చతుర్థి  వ్రతపూజలో ఉప ప్రధాన అర్చకుడు సెల్ ఫోన్ చాటింగ్ చేస్తూ స్వామివారికి పూజలు చేయడం విమర్శలకు దారితీసింది.

హారతి పళ్ళెంలో కానుకలు వద్దన్నందుకు అభిషేకానికి మంగళం !

ఆలయంలో విధులు నిర్వహించే అర్చకులు భక్తుల నుండి హారతి పళ్లెం ద్వారా వచ్చే కానుకలను  స్వీకరిస్తుంటారు. అయితే దేవాదాయశాఖ నిబంధనల మేరకు భక్తుల నుండి హారతి పల్లెం ద్వారా వచ్చే కానుకలను అర్చకులు స్వీకరించకుండా ఆలయ EO వెంకటేష్ కట్టడిచేశారు. దీంతో  ఆలయంలో పనిచేసే ముఖ్య అర్చకుడు, పరిచారిక అర్చకుడు, ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి 5.45 గంటల నిమిషాల వరకు ప్రత్యేక అభిషేకం నిర్వహించలేదు. దీంతో  మంగళవారం ఉదయం అభిషేకం చేయని అర్చకులకు మెమో ఇచ్చారు. ఆంజనేయ స్వామి గుడి అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ దానిపై సంజాయిషీ సరిగా లేనందున, వైదిక కమిటీతో చర్చించి వారిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు.

అర్చకుని ఇంట్లో జింక చర్మాలు 

కాణిపాకం అన్నదాన సత్రం నుంచి నిత్యావసర సరుకులు తరలించారనే ఆరోపణలతో ఈవో వెంకటేష్  తనిఖీలు చేశారు. ఆలయంలోని పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దీంతో  ఆలయ ఈవో వెంకటేశు సిబ్బంది ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. కాణిపాకం అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్‌ ఇంట్లో రెండు జింక చర్మాలను ఈవో గుర్తించారు. దీంతో ఆయన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు కృష్ణమోహన్ ఇంట్లో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

1.5 లక్షల నిత్యావసరాలు స్వాహా! 

ఈ తనిఖిల్లో  సుమారు 1.5 లక్షల రూపాయలు విలువ చేసే సరుకులు అన్నదాన సత్రం, స్వామి వారి ప్రసాదం తయారీ పోటు నుంచి అక్రమంగా తరలించినట్లు తెలిసింది. దీంతో  దీంతో ఆయన శనివారం తెల్లవారుజామున ఆలయ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అన్నదాన సత్రంలోని సిబ్బంది‌ ఇళ్లపై ఆకస్మికంగా దాడులు చేశారు. అన్నదానసత్రంలో పనిచేసే సిబ్బంది, ఆలయ ప్రసాదం పోటులో పనిచేసే బ్రాహ్మణులతో కలిసి ఏడు మంది ఈ సరుకులను అక్రమంగా తరలించి తమ తమ ఇళ్లలో నిల్వ ఉంచినట్లుగా ఈవో గుర్తించారు. అక్రమంగా తరలించిన సరుకులను ఈవో స్వాధీనం చేసుకున్నారు‌‌. అన్నదాన సత్రం నుంచి సరుకులను అక్రమంగా తరలించిన ఏడుగురిపై విచారణ అనంతరం ఈవో వెంకటేశు చర్యలు తీసుకున్నారు.

దేవుడి కానుకలు స్వాహా !

మహాకుంభాభిషేకం  సమయంలో.. వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ వ్యవస్థాపకులు నారాయణి అమ్మన్‌ స్వామి కానుకలు ఇచ్చారు. స్వామి వారికి ఇచ్చిన బంగారు విబూది పట్టీకి రశీదు ఇవ్వలేదు. ఈ విషయాన్ని దాత బయట పెట్టడంతో గొడవ మొదలయింది. ఆలస్యంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆలయం అధికారులకు మెమోలు ఇచ్చారు. ఆలయం ఉప ప్రధాన అర్చకులు ధర్మేష్‌ గురుకుల్‌ను సస్పెండ్‌ చేసింది. దీనిపై విచారణ కొనసాగుతుండగానే మరో దాత ఇచ్చిన కానుకపై వివాదం వెలుగు చూసింది. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీమనికంఠేశ్వర టెంపుల్‌కి విజయలక్ష్మి అనే భక్తురాలు కానుకలు ఇచ్చింది. రశీదు ఇవ్వక పోవడంతో ఆలయ ఉప ప్రధాన అర్చకులపై ఆరోపణలు వచ్చాయి. 

మొబైల్ లో మూలవిరాట్ ఫోటోలు ! 

మర్చి నెలలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం ఫోటో నెట్టింట్లో హల్‌‌చల్ చేసింది. పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి దంపతులు, వెంకటరెడ్డి అనుచరులు వినాయకస్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి అనుచరులు మొబైల్‌‌‌తో పాటు గర్భగుడిలోకి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకునే సమయంలో తమ మొబైల్‌తో మూలవిరాట్‌ను వెంకటరెడ్డి అనుచరులు ఫోటో తీశారు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. అప్పటి నుండి  కాణిపాకం  దేవస్థానం లో భద్రతా కారణాల దృష్ట్యా సెల్ ఫోన్ లను పూర్తిగా నిషేధించారు. 

చాటింగ్ చేస్తూ.. చతుర్థి  వ్రత పూజ !

ఆలయ సిబ్బంది, అర్చకులు సెల్ ఫోన్లు వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాణిపాక ఉప ప్రధాన అర్చకుడు సెల్ ఫోన్ చాటింగ్ చేస్తూ స్వామివారికి చతుర్థి  వ్రత పూజ చేయడం స్థానికంగా చర్చినీయ అంశమైంది. దేవస్థాన ఉన్నతాధికారులు సిబ్బంది ఎవరు కూడా విధుల సమయంలో సెల్ ఫోన్లు వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ  స్థానికంగా దేవస్థానంలో పనిచేసే సిబ్బంది యతెచ్చగా సెల్ ఫోన్లు బహిరంగంగానే  వినియోగిస్తున్నారు. దేవస్థాన ఉప అర్చక బాధ్యతలో ఉన్న ప్రధాన అర్చకుడు సైతం సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూనే స్వామివారికి చతుర్థి వ్రత పూజ చేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మరోవైపు దేవాదాయ శాఖ కమిషనర్  సత్యనారాయణ కుటుంబ సమేతంగా స్వామి వారి సన్నిధిలో చతుర్థి వ్రతం ఆచరించేందుకు ఆదివారం విచ్చేయగా ఆయనకు పూజ చేస్తూనే ప్రధాన అర్చకుడు సెల్ ఫోన్ చాటింగ్ చేయడం భద్రత వైఫల్యానికి, ఉన్నత అధికారులు నిబద్ధతకు  నిదర్శనంగా మారుతోంది. మరోవైపు కాణిపాక దేవస్థానం లోకి సెల్ ఫోన్లు పూర్తిగా నిషేధించుకున్నామని చెప్పుకునే ఉన్నత అధికారులు తమకు అనుకూలంగా ఉన్నవారికి గర్భగుడిలోకి సైతం సెల్ ఫోన్లు తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నారనేది అక్షర సత్యం... సాక్షాత్తు దేవాదాయ శాఖ కమిషనర్ ముందే  కాణిపాక దేవస్థానంలో సెల్ ఫోన్లను విచ్చలవిడిగా  వినియోగిస్తున్న సిబ్బందిపై అధికారులు చర్యలు ఏ మేర తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

EO వెంకటేష్ వివరణ 

సంకట హర గణపతి వ్రతం పూజ దేవస్థానంలో  జరుగలేదు. ఆస్థానమండపంలో జరిగింది. అక్కడ అందరికి cell phoneలు అనుమతి ఉంది. విచారణ జరిపిస్తాము.


NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *