జగన్ మగాడురా.. బుజ్జీ !!
40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం... తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి... అపర చాణక్యుడు... రాజకీయ దురందరుడు... తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు... రాటు తేలియన ప్రతిపక్షనేత... ఈ-గవర్నెన్స్ సృష్టికర్త .... హై టెక్ సిటీ నిర్మాత... అంకిత భావం కలిగిన ప్రజానేత... అభివృద్ధికి అంబాసిడర్.... విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక, పాలనా రంగాలలో సాంకేతికతను జోడించిన మేధావి.. పాలనలో భరోసాకు మరో పేరు... దార్శనికత కలిగిన ప్రజానేత... అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్... అతి చిన్న వయసులో MLA.. మంత్రి.. NTR అల్లుడు, ఆయన్నే ఎదురించి పార్టీను కైవసం చేసుకున్న రాజకీయ చతురుడు... అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలను రాష్ట్రపతిని చేసిన రాజనీతి కోవిదుడు..... ఒకప్పటి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్... 1989 నుండి MLA... ఇలా చంద్రబాబును గురించి చెప్పుకుంటూ పోతే శాంతాడు అంత లిస్టు వస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో... 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24వ తేదీని 'నాయుడు డే'గా ప్రకటించారు. ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబును 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం' గా పేర్కొంది. ఎకనామిక్ టైం వార్తా సంస్థ 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' అన్నది. టైమ్ ఆసియా సంస్థ "సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్" అన్నది. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాస పత్రిక 'ప్రాఫిట్' చంద్రబాబును 'హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లో ఒకరు' అని వర్ణించింది. బీబీసీ చేత 'సైబర్ సావీ చీఫ్ మినిస్టర్' అనిపించుకుంటే, సిఎన్ఎన్ వార్త సంస్థ "సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అన్నది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టోంగ్... తదితరులు భారతదేశానికి వచ్చినప్పుడు తమ షెడ్యూల్ లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఇక ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ గేట్స్ తో చంద్రబాబునాయుడుకు విడతియలేని అనుబంధం.
పడమటిన సూర్యుడు ఉదయించడం ఎలా అయితే జరగదో, 40 ఇయర్స్ చంద్రబాబు అరెస్ట్ అవడం కూడా జరిగేపని కాదని, ఇప్పటి వరకు రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తుంది. చిక్కడ దొరకడు అనే పదం.. రాజకీయాల్లో చంద్రబాబుకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక కుంభకోణాల్లో చంద్రబాబు పేరు వినిపించినా, వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ.. స్టేలు తెచ్చుకుని తప్పించుకు తిరిగారు.
అయితే ఎవరికి సాధ్యం కాదు అని భావించిన పని యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించాడు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాక, దేశ రాజకీయాల్లో సాలిడ్‌గా వినిపిస్తున్న పేరు జగన్ మోహన్ రెడ్డి. తండ్రి మరణం తర్వాత ఏకంగా 70 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టడమే కాకుండా, ఆంధ్రాలో ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేశాడు. జగన్. 2019లో గ్రాండ్ విక్టరీ కొట్టి, రాజకీయంగా రికార్డ్స్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఒక్కసారిగా జగన్ పేరు దేశవ్యాప్తంగా మారమోగిపోతుంది.
జగన్ మొండోడని, నియంత అని, అతనికి అధికారం ఇస్తే, రాష్ట్రం నాశనం అవుతుందని, టీడీపీ నాయకులతో పాటు, వారి అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. వైఎస్ మరణం తర్వాత అన్ని పార్టీలు కలిసి, జగన్‌ను టార్గెట్ చేసి, ఎన్నో ఇబ్బందులపెట్టాయి.. కానీ జగన్ మాత్రం యూటర్న్ తీసుకోకుండా మొండిగా, తనని నమ్ముకున్న ప్రజల కోసం మొండిగా నిలబడ్డాడు. చంద్రబాబు-సోనియాలు కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయించి, జగన్‌ను జైలుకు పంపి, కేసులు, కోర్టులు అని తిప్పినా మొండిగా నిలబడ్డారు. ఇక 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అప్పుడు కూడా తన పార్టీని ఇతర పార్టీలకు తాకట్టుపెట్టకుండా, తనను నమ్మి వచ్చిన నాయకుల కోసం మొండిగా నిలబడ్డారు.
2019లో అధికారంలోకి వచ్చాక మరింత మొండిగా, దూకుడుగా ముందుకు సాగుతున్నారు జగన్. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని పూర్తిగా ఖాళీ చేశాక, వచ్చిన జగన్ సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కరోనా సమయంలోనూ, నవరత్నాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు. అన్ని వర్గాల నిరుపేదలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందేందుకు, జగన్ నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపురేఖల్ని పూర్తిగా మార్చేశాడు. పుట్టిన పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదోరకంగా జగన్ సంక్షేమ పథకాలు ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎన్నికల నేపధ్యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి, “నావల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి”.. అని చెబుతున్న ఒకే ఒక్క నాయకుడు జగన్.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT US ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.