5, ఏప్రిల్ 2024, శుక్రవారం

థామస్ క్రైస్తవ మతం స్వీకరించినట్లు ఆధారాలు !

హైకోర్టులో రిట్ పిటిషన్ కు జత 


జి డి నెల్లూరు టిడిపి అభ్యర్థి డాక్టర్ వి ఎం థామస్ క్రైస్తవ మతం స్వీకరించారు అనడానికి ఆధారాలు దొరికాయి. శుక్రవారం ఆ మేరకు కొందరు గెజిట్ కాపీలను సేకరించారు. వడింగాడు ప్రకాష్ కుమారుడు అయిన వడింగాడు మునస్వామి అయిన తాను క్రిస్టియన్ మతం స్వీకరించి వి ఎం థామస్ గా పేరు మార్చుకున్నారు. 2011 జూన్ పదవ తేదీన మతము, పేరు మార్చుకున్న ఆయన 2012 అక్టోబర్ 17 న తమిళనాడు ప్రభుత్వ గెజిట్ లో ప్రకటించారు. తాను 1974 జూన్ 28 న చెన్నైలో జన్మించినట్లు పేర్కొన్నారు. ఆయన మతం మార్పిడిపై కొందరు విమర్శలు చేయటంతో జాగ్రత్త పడ్డారు. 2024 ఫిబ్రవరి 23 వ తేదీ వి ఎం థామస్ అయిన తన పేరును వడింగాడు మునస్వామి థామస్ గా పిలువ వచ్చని మళ్ళీ గెజిట్ లో ప్రకటించారు. దీనిని అడ్డం పెట్టుకుని తాను గెజిట్ లో పేరు మాత్రమే మార్చుకున్నాను అని,  మతం మార్చుకోలేదు అంటూ టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులకు, ప్రజలకు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన ఆయనకు  ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని జై హింద్ పార్టీ నాయకుడు అక్కిలిగుంట మధు హై కోర్టులో కేసు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతక్రితం ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశం ప్రకారం కార్వేటినగరం తహశీల్దార్ విచారణ చేసి ఆయన ఇంటర్ టి సి లో వడంగాడు మునశ్వామి అని, అల్లాగుంటలో జన్మించినట్లు పేర్కొన్నారు. అయితే పాస్ పోర్టులో వి ఎం థామస్ అని జన్మస్థలం చెన్నై అని ఉన్నట్టు తెలిపారు. కాగా ఆయన తల్లి రాణి తాము క్రైస్తవ మతానికి చెందిన వారమని, థామస్ 12 వ ఏట బాప్టిజం తీసుకున్నారని ఒక వీడియోలో తెలిపారు. ఆయన ఇంటి గోడలు, గేటు లోపల ఏసు ప్రభువు శిలువ గుర్తులు ఉన్న వీడియో సేకరించారు. అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించారు. కాగా థామస్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్ రెడ్డి ఆరోపించారు. క్రైస్తవ మతం స్వీకరించిన థామస్ తప్పుడు విద్యార్హతలు చూపి వైద్యునిగా చలామణి అవుతున్నారని, ఒక హత్యా ప్రయత్నం కేసులో నిందితుడిని పేర్కొన్నారు. ఇప్పుడు థామస్ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *