మొదటి రోజు జిల్లాలో 12 నామినేషన్లు
టిడిపి పార్లమెంటుకు దగ్గుమళ్ళ ప్రసాదరావు
చిత్తూరు వైసిపి అభ్యర్థిగా విజయానంద రెడ్డి
చిత్తూరు టిడిపి అభ్యర్థిగా గురుజాల జగన్మోహన్ నాయుడు
పుంగనూరు టిడిపి అభ్యర్థిగా చల్లా రామచంద్రా రెడ్డి
పలమనేరు వైసిపి అభ్యర్థిగా వెంకటే గౌడ
నగరి టిడిపి అభ్యర్థిగా గాలి భాను ప్రకాష్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో నామినేషన్ల పర్వం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజున 12 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. పార్లమెంటుకు ఒకరు, అసెంబ్లీకి 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు చిత్తూరు పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే చిత్తూరు అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానంద రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ రెడ్డి లు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి అట్టహాసంగా భారీ బల ప్రదర్శనతో నామినేషన్లను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. పుంగనూరు అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి, చల్ల పూజా రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మురళీమోహన్, సోషల్ డెమొక్రటిక్ పార్టీ తరఫున షేక్ అన్వర్ భాష నామినేషన్ దాఖలు చేశారు. నగిరి నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ దాఖలు చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గాంధీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, యు పద్మనాభం ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసిపి ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడ, ఎన్ పావని నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం పూతలపట్టు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్లు దాఖలు కాలేదు. శుక్రవారం కుప్పంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. పూతలపట్టు వైసిపి అభ్యర్థి డాక్టర్ సునీల్ కూడా నామినేషన్ వేయనున్నారు.
గురువారం టిడిపి తరఫున పార్లమెంటుకు దగ్గు మల్ల ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేయగా, అసెంబ్లీలకు ఐదు మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, నగరి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్, చిత్తూరు టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఉన్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయనందరెడ్డి, పలమనేరు అభ్యర్థి వెంకటే గౌడలు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గానికి మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పద్మనాభం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో తెదేపా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్ గాంధీ ప్రస్తుతం గంగాధర నెల్లూరుకు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. వాస్తవంగా వి ఎం థామస్ ను తెదేపా అభ్యర్థిగా ప్రకటించింది. అయన మతం మీద ఆరోపణలు వస్తున్నా నేపధ్యంలో గాంధీ నామినేషన్ వేయడం చర్చనియంశం అయ్యింది.