4, ఏప్రిల్ 2024, గురువారం

చిత్తూరు జిల్లా ఎస్పీ మీద ఎన్నికల కమిషన్ కొరడా


ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల వెల్లువ
అధికారపార్టీ నేతలు చీరలు, సారెలు పంచినా పట్టించుకోని వైనం 
చిత్తూరు టిడిపి అభ్యర్థి ఊరేగింపుకు అనుమతి నిరాకరణ 
మాజీ శాసనసభ్యుడు సికే బాబుకు భద్రత తొలగింపు 
రామచంద్ర యాదవ్ చీరలు స్వాదీనం చేసుకొని అధికార పార్టీకి అప్పగింత
జోరుగా టిడిపి సానుభూతి పరుల బైండోవర్
పుంగనూరు టిడిపి అభ్యర్థి మీద రౌడి షీట్   


పదవీ భాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా గడవక  ముందే చిత్తూరు ఎస్పీ పి. జాషువా మీద ఎన్నికల సంఘం కొరడా జాలిపించింది. ఆయనను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. ఆయనకు ఎన్నికలతో సంబంధం లేని పోస్టును కేటాయించాల్సిందిగా సూచించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు ఒక రోజు ముందు ఆకస్మికంగా ఎస్పి బదలీ కావడం చర్చనియంశం అయ్యింది. ఉన్నఫలంగా బాధ్యతలను తదుపరి అధికారికి అప్పగించి రిలీవ్ కావాల్సిందిగా ఆదేశాలలో పేర్కొంది. జిల్లా ఎస్పీగా పనిచేయడానికి ప్యానెల్ ను రూపొందించి పంపాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కోరింది.

కృష్ణా జిల్లా ఎస్పీగా పని చేసిన పి. జాషువా బదిలీ మీద ఫిబ్రవరి 4వ తారీఖున జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనఎస్పిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పలు వివాదాలు తలెత్తుతున్నాయి. ముందుగా పనిచేసిన కృష్ణాజిల్లాలో కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నట్టు సమాచారం. దీనికి తోడు చిత్తూరు జిల్లాలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసులు  ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల కమిషన్ కు పలు ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగా జిల్లా ఎస్విని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. చిత్తూరు పట్టణంలో అధికార పార్టీ నాయకులు యదేచ్చగా సభలు, సమావేశాలు జరుపుకుంటున్నారు. ఓటర్లకు కానుకలను కూడా బహిరంగంగా సరఫరా చేస్తున్నారు. ఇవి ఏవి పోలీసు అధికారులకు కనిపించడం లేదు. పైగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గురజాల జగన్మోహన్ నాయుడు పట్టణంలో ఊరేగింపుగా రావడానికి కూడా పోలీసులు అంగీకరించలేదు. అలాగే  ఐదు సార్లు చిత్తూరు శాసనసభ్యుడిగా గెలుపొందిన సీకే బాబు మీద పలు పర్యాయాలు అత్యాయత్నాలు జరిగాయి. ఒకసారి బీహార్ కు చెందిన గ్యాంగ్ తుపాకులతో  కాల్పులు జరపగా సికే బాబు తృటిలో తప్పించుకున్నారు. అలాగే సీకే బాబు ఇంటి సమీపంలో బాంబును అమర్చి ఆయనను హత్య చేయడానికి పథకం పన్నారు. ఈ ప్రమాదంలో కూడా సీకే బాబు బయటపడ్డారు. అంతకు ముందు కూడా పలు పర్యాయాలు సీకే బాబు మీద అత్యాయత్నాలు జరిగాయి. ఈ నేపద్యంలో సీకే బాబుకు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది. సీకే బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకం అయ్యారు. చురుగ్గా ప్రచార కార్యక్రమాలలో  పాల్గొనడంతో పది రోజుల కిందట గన్మెన్లను ఉపసంహరించుకుంటూ పొలీసు అధికారులు  ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఆయన కోర్టుకు వెళ్లారు. గత పది రోజుల కిందట చిత్తూరు సీకే బాబు వర్గానికి చెందిన కార్యకర్తలను చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారిని బైండోవర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సికే బాబు స్టేషన్ కు వెళ్లి వారి మీద కేసులు లేవని చెప్పాల్సి వచ్చింది. అలాగే నగిరి నియోజకవర్గంలో మంత్రి రోజా బహిరంగంగా మహిళా దినోత్సవం నాడు మహిళా టీచర్లకు చీరలను పంపిణీ చేశారు. చిత్తూరులో కూడా  ఒక సమావేశంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి కూడా మహిళా టీచర్లకు చీరలను పంపిణీ చేశారు. ఇవి ఏవీ పోలీసులకు కనిపించలేదు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు బహిరంగంగా కుక్కర్లు, గడియారాలు, ఇతర కానుకలను సరఫరా చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గ చెందిన బీసీవై పార్టీ నాయకుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రజలకు  ఇవ్వడానికి తీసుకువచ్చిన గోడ గడియారాలను, చీరలను పోలీసుల సీజ్ చేశారు. వాటిని అధికార పార్టీ నాయకులకు అప్పగించారని భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రామచంద్ర యాదవ్ కేంద్ర పెద్దలకు, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో కూడా పుంగనూరులో సీజ్ చేసిన చీరలను పంపిణీ చేశారని ఆరోపించారు. ఒక సరి రామచంద్ర యాదవ్ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే, పోలీసులే బగ్నం చేశారు. ఈ విషయంలో కూడా అయన ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని వారిని బైండోవర్ చేపించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుంగనూరు రాక సందర్భంగా పోలీసులకు, టిడిపి నాయకులకు గొడవ జరిగింది. ఈ గొడవలు వెయ్యి మందికి పైగా టిడిపి నాయకులు, కార్యకర్తల మీద కేసులను నమోదు చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు అమరనాధరెడ్డి కూడా ఉన్నారు. ఇందులో భాగంగా కొంతమంది మీద రౌడి సీట్లను కూడా ఓపెన్ చేశారు. ఎన్నికల సందర్భంగా వీరిని నియంత్రించవచ్చని ఉద్దేశంతోనే మీద రౌడీ షీట్లు ప్రారంభించారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసినవారిలో పుంగనూరు టిడిపి అభ్యర్థి చల్లా రామచంద్ర రెడ్డి కూడా ఉండటం ఇందుకు బలం చేకూర్చుతుంది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జిల్లా ఎస్పీ జాషువా నెలరోజులు కూడా తిరక్కుండా జిల్లా నుంచి ఆకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ఆయనకు ఎన్నికల విధులకు సంబంధంలేని పోస్టును కేటాయించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *