30, ఏప్రిల్ 2024, మంగళవారం

చిత్తూరు కలప దొంగను ఓడించండి

చిత్తూరులో బాలకృష్ణ పిలుపు 


చిత్తూరు, ఏప్రిల్ 29 (ప్రభ న్యూస్ బ్యూరో) చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలప దొంగ విజయానంద రెడ్డిని చిత్తుగా ఓడించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యుడు, పోలీలిట్ బ్యూరో సభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. చిత్తూరులో సోమవారం రాత్రి  జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సాంకేతమైతే, వైసీపీ పార్టీ కుంభకోణాలకు నిలయమన్నారు. ఎన్నికలలో యువకుడు అయిన గురజాల జగన్మోహన్ నాయుడును, మేధావి, అనుభవంతుడైన దగ్గుమల్ల ప్రసాదరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సైకో పోవాలి, సైకిల్ రవళి అని పిలిపినిచ్చారు. వైసిపి పార్టీ చేస్తున్న ప్రతి పనిలోనూ అవినీతి కుంభకోణాలు దాగి ఉన్నాయన్నారు. చిత్తూరు డైరీ అములుకు లీజుకు ఇచ్చే విషయంలో కూడా భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి డైరీ ని రిలీజ్ కి ఇచ్చారని, అయితే ఈ డైలాగ్ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. చిత్తూరు సహకార డైరీ ని కూడా అమ్మి వేయడానికి సిద్ధంగా  ఉన్నారని పేర్కొన్నారు. కుప్పంలో సాగునీటిని ఇచ్చినట్లు సినీ స్థాయిల్లో డ్రామా నడిపారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రావాలంటే రావాలని ఆకాంక్షిం చారు. చిత్తూరు పట్టణం ప్రశాంతంగా ఉండాలన్నా, రౌడీలకు, గుండాలకు  దూరం కావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సహకార డైరీ ని సహకార రంగంలోనే కొనసాగిస్తుందని, చిత్తూరు చక్కర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పది లక్షల వేల కోట్ల రూపాయలను తప్పు చేశారని, అందులో 2:30 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు చెల్లించారన్నారు. మిగిలిన ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చిత్తూరు పట్టణంలో గంజాయి వాడకం మీద ఆందోళన వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ సభ తెలుగుదేశం ప్రజలలో ఉత్సాహాన్ని నింపింది. ఆయన మాట్లాడుతుంటే ప్రజలు ఈలలు, కేరింతలతో స్పందించారు. ఆయన చిత్తూరు పట్టణంలో అడుగుపెట్టిన నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. గజమాలలతో, మంగళ హారతులతో స్వాగతం పలికారు. వయోభేదం లేకుండా భారీ సంఖ్యలో ఆయనను చూడడానికి ఎగబడ్డారు. చిత్తూరులో జరిగిన బాలకృష్ణ సభ విజయవంతం కావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ద్విగుణికృతం అవుతోంది. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురుజాల జగన్ మోహన్ నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు సి ఆర్ రాజన్, మాజీ ఎం ఎల్ ఏ అ ఎస్ మొనోహర్, మాజీ ఎం ఎల్ సి దొరబాబు, నాయకులు కటారి హేమలత, కోదండ యాదవ్, చంద్ర ప్రకాష్, వసంత కుమార్, జయ ప్రకాష్, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *